దేశంలో ద్వంద్వ నీతికి చెక్ పెట్టిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ; అందెల శ్రీరాములు

ఆయన స్ఫూర్తితోనే ప్రధాని మోడీజీ 370 ఆర్టికల్ రద్దు చేశారు
ఆత్మబలిదాన్ దివస్ సందర్భంగా బడంగ్ పేటలో మొక్కలు నాటిన శ్రీరాములు
ఎల్బీ నగర్ (జనం సాక్షి  )జాతీయ సమగ్రత, దేశ ప్రజల ఐక్యతను దెబ్బతీసే నాటి నెహ్రూ విధానాలను తీవ్రంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ   వ్యతిరేకించారని   మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు గుర్తు చేశారు . గురువారం  శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆత్మబలిదాన్ దివస్ సందర్భంగా బడంగ్ పేట కార్పొరేషన్ లోకాయుక్త కాలనీలో మొక్కలు నాటారు బీజేపీ నాయకులు సహా కాలనీవాసులు.
ఈ సందర్భంగా అందెల శ్రీరాములు మాట్లాడుతూ…. అఖండ భారతావనిలో ఒకే జెండా, ఒకే రాజ్యాంగం, ఒకే నినాదం ఉండాలని గట్టిగా చెప్పిన గొప్ప మహానీయుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అన్నారు.
 ప్రత్యేక సంస్థానంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ వెళ్లాలంటే నాడు ఫర్మిషన్, 370 ఆర్టికల్ విధానాన్ని వ్యతిరేకించి రద్దు అయ్యేందుకు పోరాడి అక్కడే శ్యామ్ జీ ఆత్మబలిదానమైయ్యారని గుర్తు చేశారు. ఆయన ప్రాణత్యాగం వృధాకాకుండా దేశ ప్రజల అభిష్టం మేరకు ప్రధాని నరేంద్రమోడీ గారు 370 ఆర్టికల్ రద్దు చేశారని కొనియాడారు. దేశం మొత్తం ఒక్కటే భారత రాజ్యాంగం అమలు చేస్తున్న ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు అందెల శ్రీరాములు యాదవ్. ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో బడంగ్ పేట కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి, కార్పొరేటర్ అమితా శ్రీశైలం చారి, మంత్రి మహేశ్ ముదిరాజ్, బిట్టు, విజయ్ కుమార్, శశిధర్ జీ, ప్రవీణ్ కుమార్, నరేందర్, గులాబ్ సింగ్, సునీల్, వెంకటరెడ్డి, మన్నె గోపికృష్ణ, పోరెడ్డి జగన్ మోహన్ రెడ్డి, రవికాంత్ గౌడ్ సహా బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.