దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ – రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్.

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి)* దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని  రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు.
స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా శంషాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కౌన్సిలర్ సంజయ్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని కాపుగడ్డ నుంచి శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండు, ఆర్బి నగర్, ఎయిర్పోర్ట్ కాలనీ,కొత్వాల్ గుడలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పాల్గొని మాట్లాడారు.
చిల్లర రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌కు పోటీనే కాదని వ్యాఖ్యానించారు. తెల్ల దొరల నుంచి దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబ నాయకత్వం ఉన్న పార్టీ కాంగ్రెస్ అన్నారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించింది రాజీవ్ గాంధీ అని, ఐటిని అభివృద్ధి పరిచి కంప్యూటర్, సెల్‌ను అందరికీ పరిచయం చేసిందే కాంగ్రెస్ పార్టీ నేతలని కొనియాడారు.దేశం కోసం ప్రాణాలర్పించిన వారిలో మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఉన్నారని అన్నారు. వారి చివరి శ్వాస వరకు దేశాన్ని ప్రేమించాలని అలాంటి గొప్ప వ్యక్తుల ఆశయాల అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేణు గౌడ్, గడ్డం శేఖర్ యాదవ్,సానెం శ్రీనివాస్ గౌడ్,జల్లపల్లి నరేందర్,సులోచన, కోటేశ్వర్ గౌడ్, శేఖర్ గుప్తా, ప్రవీణ్, నజీర్, జహంగీర్ ఖాన్, శ్రీధర్ యాదవ్, చందు యాదవ్, సిద్దేశ్వర్ గౌడ్, మహేందర్, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : శంషాబాద్లో ర్యాలీగా వెళుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.