దేశభక్తి రగిలించేలా వజ్రోత్సవాలు
★ ప్రతి ఇంటి పై తిరంగా జెండా
★ స్వాతంత్ర్య స్ఫూర్తి పెరిగేలా ఉత్సవాలు
★ భారతావని గర్వపడేలా పండగ
★ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని మేల్కొలుపాలి
★ ప్రతి గుండెలో భారతీయత నిండేలా
★ వైభవంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు
★ ఆగస్టు 08 నుండి 20 వరకు ఉత్సవాలు
★ సన్నాహక సమావేశంలో మంత్రి గంగుల
కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి ) :
దేశభక్తి పెంపొందే విధంగా వజ్రోత్సవాలు నిర్వహించాలని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం వజ్రోత్సవాల నిర్వహణ పై కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి అధికారులతో మంత్రి గంగుల కమలాకర్ సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రజల్లో అడుగడుగునా దేశభక్తి భావన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో మేలుకొలిపేలా సమున్నతంగా, అంగరంగ వైభవంగా వీటిని నిర్వహించాలని సూచించారు.
పాఠశాల విద్యార్థులు మొదలుకొని ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీయువకులు. ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో 3,08,427 గృహాల పై జాతీయ జెండాలను ఎగురవేయలని పిలుపునిచ్చారు.
ప్రతి ఇంటికి జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీచేయాలని ఆదేశించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహా’న్ని ఘనంగా నిర్వహించనున్నదని మంత్రి వెల్లడించారు.
జిల్లాలో ఈ నెల 8 నుంచి 20వరకు నిర్వహించే కార్యక్రమాల విజయవంతం లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయ్యేవిధంగా అధికారులు చోరువ తీసుకోవాలని పిలుపునిచ్చారు.
* ప్రతి ఇంటిపై జాతీయ జెండా
ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమ విజయవంతానికి అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా 9వ తేదీ నుంచే జిల్లా వ్యాప్తంగా జాతీయ పతాకాల పంపిణీని చేపట్టాలని సూచించారు. ఈ పంపిణీ కార్యక్రమం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో జరగాలని పేర్కొన్నారు.
* ఆగస్టు 8న ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం
వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవ సమారోహాన్ని ఆగస్టు 8న ప్రారంభమవుతుందని ఇందులో భాగంగా ఆర్మీ,పోలీస్ బ్యాండ్‌తో రాష్ట్రీయ శాల్యూట్ జాతీయ గీతాలాపన, స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనను నిర్వహించాలని ఆదేశించారు.వజ్రోత్సవాలలో భాగంగా ఈనెల 11 న ఫ్రీడం రన్ అంబెడ్కర్ స్టేడియం నుండి తెలంగాణ చౌక్ వరకు 50,000 మందితో నిర్వహిస్తున్నట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్ వి కర్ణన్ నగర మేయర్ వై సునీల్ రావు అడిషనల్ కలెక్టర్లు గరిమ అగర్వాల్ ,శ్యామ్ ప్రసాద్ లాల్ ,జడ్పీ చైర్మన్ కనమల విజయ ,అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ నగర పాలక సంస్థ కమీషనర్ సేవా ఇస్లావత్ , మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు అధికారులు పాల్గొన్నారు.
* వజ్రోత్సవాల షెడ్యూల్
ఆగస్టు 08: ప్రారంభ సమారోహం
– ఆగస్టు 09: ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభం.
– ఆగస్టు 10: వజ్రోత్సవ వన మహోత్సవంలో భాగంగా.. గ్రామాల్లో మొకలు నాటడం, ఫ్రీడం పారుల ఏర్పాటు
– ఆగస్టు 11: ఫ్రీడం రన్ నిర్వహణ
– ఆగస్టు 12: రాఖీ దినోత్సవం సందర్భంగా వివిధ మీడియా సంస్థల
– ద్వారా వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలకు విజ్ఞప్తి
– ఆగస్టు 13: విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ
సామాజిక వర్గాలతో వజ్రోత్సవ ర్యాలీలు
– ఆగస్టు 14: సాయంత్రం.. సాంస్కృతిక సారథి కళాకారుల చేత
నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్కృతిక, జానపద
కార్యక్రమాలు. ప్రత్యేకంగా పటాకులతో వెలుగులు
– ఆగస్టు 15: స్వాతంత్య్ర దిన వేడుకలు, ఇంటింటా జెండావిష్కరణ
– ఆగస్టు 16: ఏకకాలంలో ఎక్కడి వారి అక్కడ తెలంగాణ వ్యాప్తంగా
సామూహిక జాతీయ గీతాలాపన. సాయంత్రం
కవి సమ్మేళనాలు,ముషాయిరాల నిర్వహణ
– ఆగస్టు 17: రక్తదాన శిబిరాల నిర్వహణ
– ఆగస్టు 18: ఫ్రీడం కప్ పేరుతో క్రీడల నిర్వహణ
– ఆగస్టు19: దవాఖానలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు,
జైళ్లల్లో పండ్లు, స్వీట్ల పంపిణీ
– ఆగస్టు 20: దేశభక్తి, జాతీయ స్ఫూర్తి చాటేలా ముగ్గుల పోటీలు