దేశవ్యాప్త సమ్మెవిజయవంతం చేయండి
– అల్లం నారాయణ వైఖరి మార్చుకో..
– తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్
హైదరాబాద్,ఆగస్టు 29(జనంసాక్షి):సెప్టెంబర్ 2న దేశవ్యాప్త కార్మికులు, ఉద్యోగులు ఒక్కరోజు తలపెట్టిన సార్వాత్రిక సమ్మెకు మద్దతునిస్తూ విజయవంతం చేయాల్సిందిగా తమ సీపీఐ(మావోయిస్టు) పార్టీ పిలుపునిచ్చిందని తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఒక లేఖలో పేర్కొన్నారు. ఆయన ఈ లెఖలో పలువిషయాలు తెలిపారు. తెలంగాణ ప్రెస్‌అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తన వైఖరి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఆయనింకా ఏమన్నారంటే..”తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకాలంలో జర్నలిస్టుల హక్కులకు, ఆరోగ్య, విద్య, గృహ వసతికి హామీపడిన కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ హామీలను నీటిబుడగలుగా మార్చాడు. డబుల్‌బెడ్‌రూం, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు, జర్నలిస్టులకు సకల సౌకర్యాలు అంటూ ఊదరగొట్టిన కేసీఆర్ నేటి వరకు అమలు పర్చకపోగా, ప్రశ్నించి పోరాడుతున్న జర్నలిస్టులను, వారి పక్షాన నిలబడ్డ ప్రజా ఉద్యమనాయకులను అవమానిస్తూ, తన భజనపరులతో మాట్లాడిస్తున్నారు. ఒకనాటి ప్రగతిశీల జర్నలిస్టుగా ఉండి, నేడు ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా ఉన్న అల్లం నారాయణ జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల పట్ల నిలబడి మాట్లాడినందుకు, ప్రజా ఉద్యమ నాయకులు జస్టిస్ చంద్రకుమార్‌ను అవమానించడం భావప్రకటనా స్వేచ్ఛను హరించడమే. పాలకులు విదిల్చిన ఎంగిలి మెతుకులకు ఆశపడి అహంకారంగా, అవ మానించి మాట్లాడటం ప్రజలకు, ప్రజాఉద్యమాలకు ద్రోహం చేయడమే. దీన్ని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఇలాంటి వారిని ఖండించి, ఎక్కడికక్కడ నిలదీయాల్సిందిగా పిలుపునిస్తున్నాం. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లు సాధించుకునేంత వరకు ప్రభుత్వంపై మడమ తిప్పని పోరాటాన్ని కొనసాగించండి. మీ న్యాయపరమైన డిమాండ్ల సాధనకు, పోరాటానికి మా పార్టీ అండగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఇలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం విధానాలు వ్యతిరేకిస్తూ దేశంలోని కార్మిక సంఘాలన్నీ కలిపి గత సంత్సరం ఇదే రోజు(సెప్టెంబర్ 2)న ఒకరోజు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. అప్పుడు ఉన్న డిమాండ్లలో ఒక కనీసవేతనం డిమాండ్ మాత్రమే స్వల్పంగా మారింది. పోయిన ఏడాది కనీసవేతనం రూ.17000 అడిగిన వారు ఇప్పుడు రూ.18000 అడుగుతున్నారు. అధిక ధరల అదుపు, కార్మిక చట్టాల అమలు, కార్మికుందరికీ సామాజిక భద్రత, శాశ్వత పనుల్లో కాంట్రాక్టు పని విధానం రద్దు, నూతన ఉపాది కల్పన, కార్మిక చట్టాల సవరణల ఉపసంహరణ, రైల్వేలో విదేశీ పెట్టుబడులకు(ఎఫ్‌డీఐ)ల ఉపసంహరణ వంటివన్నీ గత ఏడాది డిమాండ్లే, ఏడాదిగా కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్లపై సానుకూలంగా గాని, చిత్తశుద్ధిగా స్పందించి లేదు. పైగా ఈ డిమాండ్లకు వ్యతిరేకంగా తన చర్యలను శరవేగంగా అవలంభించింది. అభివృద్ధి పేరుతో విధ్వంసపు విధానాల ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున విస్తాపితులను చేస్తూ, జీవనాధారమే లేకుండా చేస్తూ, నిరుద్యోగ సమస్యను, పేదరికాన్ని పెంచి బతుకుల్ని దుర్భర స్థితిలోకి నెట్టివేస్తున్నారు. ఈ విధానాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఇదివరకే అనేక చట్టాలను సవరిస్తూ ఇప్పుడు కేంద్రంలో అధికారానికి వచ్చిన బీజేపీ నరేంద్రమోదీ ప్రభుత్వం మరింత దుర్మార్గంగా చట్టాలను సవరించాలనుకుంటున్నంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారం నెరుపుత్ను టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా అన్ని విషయాల్లోనూ కేంద్రప్రభుత్వ విధానాలకు అనుకూలంగానే తన విధానాలను రూపొందించుకుంటూ అమలు చేస్తుంది. 12 ఏళ్లకు ఒకసారి పుష్కరస్నానాలు చేసినట్టే తాజాగా తిరిగి ఇవే సమస్యలపై ఒక్కరోజు సార్కాత్రిక సమ్మెకు అదే సెప్టెంబర్ 2న పిలుపునిచ్చాయి. ఏడాదికి ఒకసారి సార్వత్రిక సమ్మెకు పిలుపు ఇవ్వడం జరుగుతోంది. పుష్కర స్నానంతో పుణ్యం రానట్టే ఒక్కరోజు సమ్మెతో కేంద్ర ప్రభుత్వ విధానాలు ఆపుతున్నది లేదు. ప్రజానుకూలంగా మారుతున్నది లేదు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాం ప్రజా వ్యతిరేక విధానాలను ఓడించి దేశ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కార్మిక వర్గం, రైతాంగం తదితర పీడిత ప్రజల సంఘటిత, సమరశీల నిరవధిక పోరాటానికి ససేమిరా సిద్ధంగా లేవన్నది కనబుడుతున్నది. పాము చావకుండా, కర్ర విరగకుండా ఉండేటి వీరి ఈ విధానాల మూలంగానే దేశంలో దోపిడీ వర్గ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు దినదినం పెచ్చరిల్లిఓతున్నాయి. ఫలితంగా పేద ప్రజల బతుకులు రోడ్డున పడుతున్నాయి. విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులు, బహుళజాతి సంస్థలు దేశ వనరులను కొల్లగొట్టడాన్ని ప్రతిఘటిస్తూ, ఈ దేశ పీడిత ప్రజల ప్రయోజనాలను అనుగుణంగా ‘జల్ జంగల్, జమీన్’పై ఆదివాసులకే సర్వ అధికారాలు ఉండాలని మా పార్టీ చిత్తశుద్ధితో, త్యాగ నిరతితో ప్రజా యుద్ధాన్ని సాగిస్తున్నందునే దోపిడీ వర్గ ప్రభుత్వాలన్నీ మావోయిస్టు పార్టీపై, విప్లవ ప్రజాసంఘాలపై ఫాసిస్టు దమనకాండను సాగిస్తూ, ఎన్‌కౌంటర్ల పేర విచ్చల విడిగా హత్యలు గావిస్తున్నాయి. మరోకవైపు కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చే పార్టీలు, ప్రజా సంఘాలు విప్లవోద్యామంపై, విప్లవ సంస్థలపై ప్రభుత్వాలు సాగిస్తున్న ఫాసిస్టు దమనకాండ పట్ల పట్టనట్లు ప్రవర్తిస్తున్నాయి. చత్తీస్‌గడ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, బెంగాల్ రాష్ట్రాలలో లక్షలాది అర్ధసైనిక బలగాలతో సాగిస్తున్న దమనకాండ అంతా దేశ వనరులను కొల్లగొట్టేందుకు, కార్మిక, రైతాంగ, ఆదివాసి ప్రజానీకపు బతుకులను మరింత దుర్భరస్థితికి ఈ ప్రభుత్వాలు నెట్టివేస్తున్నాయి. కార్పొరేట్ల ప్రయోజనాలు పరిరక్షించేందుకే ఈ దేశ పాలకులు దళారులుగా మారారు. కాబట్టి దేశవ్యాప్త సార్వాత్రికి సమ్మెకు పిలుపునిచ్చే, మద్ధతు ఇచ్చే పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులంతా సమ్మెకు దేశమే స్థంభించిపోయేలా విజయవంతం చేసి నిరవధిక పోరాటానికి పూనుకొని పాలకుల మెడలు వంచేంత వరకు పోరాడాలని మా పార్టీ పిలుపునిస్తుంది. అలాగే విప్లవోద్యంపై, మా పార్టీపై సాగుతున్న ప్రభుత్వ ఫాసిస్టు దమనకాండను కూడా వ్యతిరేకించాల్సిందిగా కోరుతున్నాం” అని తెలిపారు.