దేశానికి ఆదర్శంగా కెసిఆర్‌ పథకాలు

రైతుబంధు అమలే ఇందుకు నిదర్శనం:ఎమ్మెల్యే
నిజామాబాద్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అర్బన్‌ ఎమ్మెల్యే బీగాల గణెళివ్‌ గుప్తా  అన్నారు. ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన రైతుబీమా పథకమే ఇందుకు నిదర్శనమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బ్జడెట్‌లో రైతుబంధు లాంటి పథకం ప్రవేశ పెట్టిందన్నారు. కేంద్రానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయం కన్నా ఎక్కువ ఇవ్వాలన్నారు. ఏడాదికి కేవలం రూ.6వేలు మాత్రమే ఆర్థిక సాయం ప్రకటించడం.. అది కూడా మూడు విడతల్లో ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు సీఎం కేసీఆర్‌ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నారన్నారు. గతంలో రూ.లక్ష పంట రుణాలను మాఫీ చేశారని గుర్తుచేశారు. మరోసారి రూ.లక్ష రుణం మాఫీ చేస్తామని చెప్పారు. పంట పెట్టుబడి కోసం ఎకరాకు రూ.8వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు ఆర్థిక సాయాన్ని రూ.10 వేలకు పెంచుతామని, రైతుబంధు పథకాన్ని అన్ని రాష్ట్రాలు స్వాగతిస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు బంధు పథకం గురించి ఐక్యరాజ్య సమితిలో చర్చించడం కేసీఆర్‌కు దక్కిన గౌరవం అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా ప్రోత్సహించి ఉపాధి పెంపొందించేందుకు కృషిచేస్తున్నామన్నారు.