దేశానికి ఆదర్శం దళిత బంధు పథకం

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

దళితుల జీవితాల్లో కొత్త వెలుగు

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి)ఆగస్టు 5 :

గద్వాల పట్టణంలో జమ్మిచెడు 5వ వార్డ్ చెందిన ద్వారకా రాణి కి దళిత బంధు ద్వారా లబ్ధిదారులకు ఎంపికైన 10 లక్షల వ్యయంతో ద్వారక ట్రేడర్స్ సిమెంట్ & స్టీల్ షాప్ మంజూరు కావడం జరిగింది.ఈ యూనిట్ ని గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్రెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగినది.
ఎమ్మెల్యే, చైర్మన్ లకు ద్వారక రాణి ప్రవీణ్ పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ..

 

గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు దళితుల కోసం దళిత బంధం పథకం ప్రవేశపెట్టడం జరిగినది అని అన్నారు.
దళితులను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే గత ప్రభుత్వాలు ఉపయోగించుకున్నారు. వారికి ఎలాంటి పథకాన్ని ప్రవేశపెట్ట లేదు వారి అభివృద్ధి కొరకు ఎలాంటి కృషి చేయలేదని అన్నారు.
ప్రపంచంలో ఏ ప్రధానమంత్రికి ఏ ముఖ్యమంత్రి కి రాని ఆలోచన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ రావడం జరిగింది.దళితులను కూడా ఆర్థికంగా ఎదగాలని దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టి దళితులు ఆర్థికంగా ఎదగాలి దళితులు కూడా నలుగురికి ఉపాధి కల్పించే విధంగా ఉండాలని దళితులు గతంలో ఓట్లు వేసే యంత్రాలుగా ఉపయోగించుకున్నారు తప్ప వారికి ఏమాత్రం కూడా ఇలాంటి ఆర్థిక సంబంధించిన పథకాలను గాని ప్రయోజనాలు గాని పెట్టలేదు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ గారు దళితుల కోసం ప్రత్యేకంగా దళిత బంధు, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితుల మహిళలకు కుట్టుమిషన్లు, కుటీర పరిశ్రమలకు సంబంధించిన పరికరాలను అందజేస్తూ వారికి అన్నివిధాలుగా అండగా నిలిచి నాయకుడు సీఎం కేసీఆర్ గారు పేర్కొన్నారు.
దళిత బంధు మొదటి విడతగా నియోజకవర్గానికి 100 యూనిట్లను పంపిణీ చేయడం జరిగింది. భవిష్యత్తులో మరికొన్ని యూనిట్లను పంపిణీ చేయడం జరుగుతుంది అని తెలిపారు.
దళితులు కూడా ఆత్మ ధైర్యంతో బతికేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అన్నివిధాలుగా అండగా నిలిచిన నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు.
దళిత బంధు పథకంలో లబ్ధి పొందిన లబ్ధిదారులు నలుగురికి ఉపాధి కల్పించే విధంగా ఎదగాలి భవిష్యత్తులో ప్రతి ఒక్క దళిత ఆర్థికంగా ఎదగాలి సమాజంలో దళితులు కూడా అన్ని వర్గాలతో సమానంగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బియస్ కేశవ్, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, వైస్ చైర్మన్ బాబర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ బాబు, కౌన్సిలర్స్ నాగిరెడ్డి, కృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ సతీష్, గద్వాల టౌన్ తెరాస పార్టీ అధ్యక్షుడు గోవిందు, మండలం తెరాస పార్టీ అధ్యక్షుడు రాముడు, తెరాస పార్టీ నాయకులు , భగీరథ వంశీ, కురుమన్న , సత్యనారాయణ, రాయుడు, తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.