దేశాన్ని సేల్స్ ఆఫ్ ఇండియా గా మార్చిన మోడీ
*అభివృద్ధిలో 75 ఏళ్ల వెనుకబాటు
*14 న జన జాగృతి
విలేకరుల సమావేశంలో జులకంటి
మిర్యాలగూడ. జనం సాక్షి
కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇస్తూ… పేదలపై భారాలు మోపే మోదీ ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెట్టిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్ర ఉద్యమంలో ఏమాత్రం పాత్రలేని బిజెపి ఆర్ఎస్ఎస్ లు ఇప్పుడు తామే స్వాతంత్రం తీసుకొచ్చినట్లు గొప్పలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు కుట్టలు పన్నుతుందని విమర్శించారు. ఆనాటి స్వాతంత్రోద్యమంలో బిజెపి పార్టీ ఎక్కడుందని ప్రశ్నించారు. స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీని చంపిన గాడ్సే ను పూజించిన బిజెపి నాయకులు ఇప్పుడు అజాదిక అమృత్ మహోత్సవం నిర్వహించడం సిగ్గుచేటు అన్నారు. దేశ సంపదను లోటు చేసి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించి భరతమాతను అంగట్లో పెట్టి అమ్మేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. మత విద్వేషాలు సృష్టించి అభివృద్ధిలో 75 ఏళ్ల వెనుక బాటు తెచ్చారని ధ్వజమెత్తారు. స్వాతంత్రం, లోకతత్వం, ఫెడరలిజం, సామాజిక న్యాయం, సామ్రాజ్యవాద వ్యతిరేక విధానం ప్రధానంగా ఉండాలని వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. స్వాతంత్ర ఉద్యమంలో కమ్యూనిస్టులు పాత్ర కీలకంగా ఉందని వాటిని ప్రజల వివరించేందుకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నేడు దేశవ్యాప్తంగా క్విట్ మోదీ, క్విట్ కార్పొరేట్, క్విట్ బీజేపీ ప్రభుత్వం అనే నినాదాలు ప్రజల్లోకి తీసుకెళ్లామని తెలిపారు. ఈనెల 13న జాతీయ ఉద్యమం- కమ్యూనిస్టుల పాత్ర అనే అంశంపై సెమినార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 14న జన జాగృతి,15న పార్టీ కార్యాలయాల్లో జండా ఆవిష్కరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా నాయకులు డా. మల్లు గౌతమ్ రెడ్డి, తిరుపతి రామ్మూర్తి, పగిడోజు రామ్మూర్తి,చెనగని యాదగిరి, కోటి రెడ్డి, పర్వతం లింగయ్య, వెంకట్ రెడ్డి, బంటు రామారావు తదితరులు పాల్గొన్నారు