దేశాభివృద్ధిలో రాష్ట్రాలదే ప్రధాన భూమిక

కేంద్ర, రాష్ర్టాల మధ్య సంబంధాలపై భారీ కసరత్తు ప్రారంభించామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ అన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలపై భారీ కసరత్తు చేశామని, కేంద్రం నుంచి రాష్ట్రాలకు 42 శాతం నిధులు అందుతాయని అన్నారు. దేశాభివృద్ధిలో రాష్ట్రాలదే ప్రధాన భూమిక అన్నారు. 14వ ఆర్థిక సంఘం ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. ఎన్నో సవాళ్లను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్కు కొత్త రూపు ఇచ్చామని, తయారీ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చామని జైట్లీ చెప్పారు. జీడీపీ వృద్ధిరేటు 8 నుంచి 8.5 శాతం అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచమంతా భారత్వైపే ఆసక్తిగా చూస్తోందని జైట్లీ తెలిపారు