దేశ గురువు పేరుతో మోసపోవద్దు – చీకూరి లీలావతి
హుజూర్‌నగర్ అక్టోబర్ 11 (జనం సాక్షి): మండలంలోని గోపాలపురంలో దేశ గురువు పేరుతో ఒక వ్యక్తి తిరుగుతూ ఘరానా మోసానికి పాల్పడుతున్నాడని విన్నపం ఒక పోరాటం అధ్యక్షురాలు చీకూరి లీలావతి ఆరోపించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ దేశ గురు పేరుతో మోసపోవద్దని, తన మాయ మాటలతో బురిడీ కొట్టించి వేలకు వేలు వసూలు చేసే వారిని నమ్మి ప్రజలు ఎవరు మోసపోవద్దని అన్నారు. ఇటువంటి విషయాలపై సంభందిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి మోసాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి, చైతన్యం తీసుకురావాలని ఆమె కోరారు.