దేశ రాజకీయాల్లో సిపిఐ కీలక పాత్ర పై నిర్ణయం
సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయ రాములు
వనపర్తి టౌన్ అక్టోబర్ 11 (జనం సాక్షి) విజయవాడలో ఈనెల 14 నుంచి 18 వరకు సిపిఐ జాతీయ మహాసభలు జరగనున్నాయని దేశ రాజకీయాల్లో కమ్యూనిస్టుల పాత్ర పై కీలక నిర్ణయం జరుగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయ రాములు అన్నారు మంగళవారం వనపర్తి సిపిఐ జిల్లా కార్యాలయంలో జాతీయ మహాసభల వాల్పోస్టర్లను విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో బిజెపి మతోన్మాద పాలన ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమించింద న్నారు మతవైశ్యమ్యాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తుందన్నారు రాష్ట్రాల పునర్విభజనలో ఒప్పందాలను అమలు చేయలేదన్నారు పాలమూరు రంగారెడ్డికి అనుమతులు ఇవ్వడం లేదన్నారు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మొండి చేయి యి చూపిందన్నారు పంటలకు గిట్టుబాటు ధర లేదని, నిరుద్యోగం ,అధిక ధరలు తారా స్థాయిని చేరాయ న్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని రైతు ఆదాయాన్ని పెంచుతామని నల్లధనం వెలికి తీసి 15 లక్షల చొప్పున రైతకౌంట్లో వేస్తామని మాట తప్పేరన్నారు . వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రజలకు మతం కళ్లగంతలు కడుతున్నారన్నారు కార్పొరేట్ శక్తులకు కొమ్ముగాసి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తుందన్నారు 80% సంపద కొద్దిమంది ధనవంతుల చేతుల్లో పెట్టిందన్నారు కార్మిక చట్టాలను కాల రాసిందన్నారు రైతు కూలీ కార్మికులకు ద్రోహం చేసిందన్నారు బిజెపిని తక్షణం గద్దె దించటం దేశంలో విపక్షాలకు ఏకైక ఎజెండా ఉందన్నారు అందువల్లనే బిజెపిని గట్టిగా ఢీకొంటున్న టిఆర్ఎస్ కు మునుగోడులో సీపీఐ మద్దతిస్తుందన్నారు అంతమాత్రాన రాష్ట్ర ప్రభుత్వాన్ని మోయాల్సిన అవసరం లేదన్నారు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు ,కోయిల్ సాగర్ ,సంఘం బండ ప్రాజెక్టుల పూర్తికి టిఆర్ఎస్ ప్రభుత్వం పై పోరాటం ఆపేది లేదన్నారు బిజెపి టీఆర్ఎస్ లోపాలను క్యాడర్లోకి ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు స్థానిక ప్రజా సమస్యల గుర్తించి పోరాడాల న్నారు గ్రామాల్లో వృద్ధాప్య పింఛన్లు, రేషన్ కార్డులు ,ఇళ్ల స్థలాలు, పోడు భూములు, దళిత బంధు తదితర ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు పోరాటం ద్వారా ప్రజల ఆకర్షించి గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయాలన్నారు జాతీయ మహాసభల్లో క్యాడర్లలో స్ఫూర్తి నింపనుందని జిల్లా తరఫున పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పి కళావతమ్మ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రయ్య ఏఐటిసి జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్ సహాయ కార్యదర్శి ఎర్రకురుమన్న ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ శాంతన్న తదితరులు పాల్గొన్నారు