దేశ సార్వబౌమత్వన్ని లౌకిక తత్వాన్ని కాపాడాలి
హుజూర్ నగర్ ఆగస్టు 8 (జనం సాక్షి): దేశ సార్వ బౌమత్వన్ని లౌకిక తత్వాన్ని కాపాడాలని
సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి నాగారాపు పాండు అన్నారు. సోమవారం క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవంను పురస్కరించుకొని హుజూర్ నగర్ పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాండు మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీ తప్ప మరి ఏ పార్టీ పోరాటం చేయలేదని గుర్తు చేశారు. స్వతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ బిజెపిలు ఎక్కడ పాల్గొన ఆనవాలు లేవని గతంలో వాజ్ పాయ్ ప్రభుత్వంలో నేటి మోడీ పాలనలో స్వతంత్ర పోరాట చరిత్రను వక్రీకరిస్తూ సొంత ఏజెండాను ముందుకు తీసుకువస్తుందని అన్నారు. ప్రజలు చరిత్ర వాస్తవాలు తెలుసుకోవాల్సి ఉందని. బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి మతత్వ ఎజెండా పాలన సాగిస్తూ దేశ భాషల మీద, ఆహార అలవాట్లు మీద ఆంక్షలు విధిస్తూ ఒకే దేశం ఒకే మతం ఉండాలంటూ దేశ లౌకిక తత్వాన్ని కాలరాస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి, దుగ్గి బ్రహ్మం, మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్, కార్యదర్శి వర్గ సభ్యులు జక్కుల వెంకటేశ్వర్లు తుమ్మకొమ్మ.యోన, చిన్నం వీరమల్లు, రేపాకుల మురళి, శీలం వెంకన్న, ఎలక సోమయ్య, మధు, పాశం వీరబాబు, పిన్నపరెడ్డి వెంకటరెడ్డి, కుక్కడప్పు సైదులు, అరవింద్, ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.