దొంగతనం చేసాడని డిప్యూటీ రేంజి అధికారిపై పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసిన కాంట్రాక్టర్

అచ్చంపేట ఆర్సి, అక్టోబర్ 1 (జనం సాక్షి )న్యూస్ : నియోజకవర్గ పరిధిలోని లింగాల మండలంలో అప్పాయ పల్లిలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పై సిమెంటు బస్తాలు దొంగతనం చేసాడని బల్ముర్ పోలీసు స్టేషన్లో గత సెప్టెంబర్ నెలలో 29 వ తేదీన చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పని చేపట్టిన కాంట్రాక్టర్ బీసం ఆంజనేయులు ఫిర్యాదు చేసిన ఘటన వెలుగు చూసింది. ఈ సందర్భంగా బాధితుడు బీసం ఆంజనేయులు మాట్లాడుతూ… 2020 సంవత్సరం లో అప్పాయి పల్లి ఫారెస్టు బేస్ క్యాంపు సలేశ్వరం పరిధిలో సుమారు ఏడు లక్షల రూపాయల వ్యయంతో ఫైర్ వాచ్ టవర్ పనుల కోసం కాంట్రాక్టు చేపట్టినానని వాటికి సంబంధించిన 99వేయిల విలువగల సిమెంట్ బస్తాలను అప్పాయి పల్లి బేస్ క్యాంప్ కార్యాలయంలో నిల్వచేయగా తనకు తెలియకుండా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆనందం దొంగతనంగా తీసుకెళ్లాడని అంతటితో ఆగకుండా మళ్లీ ఇటీవలే మూడు నెలల క్రితం బల్ముర్ మండల పరిధిలో పనుల నిమిత్తం అక్కడి బీట్ ఆఫీసు లో ఉంచిన 53 సిమెంట్ బస్తాలను 45 కలర్ పెయింట్ డబ్బాలను దొంగతనం గా ఇదే డిప్యూటీ రేంజి ఆఫీసర్ ఆనందం అచ్చంపేట లో తన స్వంత ఇంటి నిర్మాణానికి వాడుకున్నా డని ఇలా ఎందుకు చేస్తున్నావు అని నేను అతన్ని నిలదీయగా.. నీమీద ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాను అని భేదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపాడు. డిప్యూటీ రేంజి ఆఫీసర్ ఆనందం పై సంబంధించిన ఉన్నతాధికారులకు తాను పిర్యాదు చేయడమే కాకుండా పోలీసు స్టేషన్లో కూడా కేసు నమోదుకు పిర్యాదు చేసాను అని బాధితుడు తెలిపాడు.ఇదే అంశంపై జిల్లా అటవీ అధికారిని, డిప్యూటీ రేంజి ఆఫీసర్ ఆనందాన్ని చరవాణి ద్వారా సంప్రదించగా అందుబాటులో లేకపోవడంతో ఫారెస్ట్ సెక్షన్ అధికారి నవీన్ రెడ్డిని వివరణ కోరగా డిప్యూటీ రేంజి అధికారి ఆనందం పై వచ్చిన ఆరోపణలపై ప్రత్యేక విచారణ చేపట్టి అందులో నిజనిజాలు ఏంటో లేక దోషి అని రుజువు అయితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.