‘దొంగలున్నారు జాగ్రత్త’ గొప్ప యూనిక్ థ్రిల్లర్ : ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్

 

డి సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్‌, సునీత తాటి గురు ఫిలింస్‌ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. యువ హీరో శ్రీ సింహ కోడూరి ప్రధాన కథానాయకుడు. సర్వైవల్ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
శ్రీసింహ మాట్లాడుతూ..నా కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి గొప్ప కాన్సెప్ట్ వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. తెలుగులో ఇలాంటి సినిమా ఇంతవరకూ ఎవరూ చేయలేదు. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రం కోసం నన్ను ఎంపిక చేసుకున్నందుకు సురేష్ బాబు గారు, సునీత గారు , దర్శకుడు సతీస్ కి కృతజ్ఞతలు. ఇలాంటి సినిమాలకు రచన చాలా బలంగా వుండాలి. సతీష్ గారు అద్భుతంగా రాసి తీశారు. ప్రీతి అస్రాణి పాత్ర చాలా ప్రభావంతగా వుంటుంది. శ్రీకాంత్ అయ్యంగార్ తన అనుభవాన్ని ఈ కథలో చాలా గొప్పగా యాడ్ చేశారు. సముద్రఖని గారి ప్రజన్స్ తో సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళుతుంది. ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నడికుడికర్ బ్రిలియంట్ వర్క్ చేశారు. రామానాయుడు స్టూడియోలో చాలా అద్భుతమైన సెట్ వేశారు. డీవోపీ యశ్వంత్ గొప్ప కెమరా వర్క్ అందించారు. ఒకే లొకేషన్ చూడడం ప్రేక్షకులకు మొనాటనీ అనిపిస్తుంది కదా అనే ఫీలింగ్ వుండేది. కానీ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఆ ఫీలింగే రాలేదు. చాలా బ్రిలియంట్ విజువల్స్ ఇచ్చారు. సెప్టెంబర్ 23న సినిమా థియేటర్ కి వస్తుంది. అందరూ థియేటర్ కి వెళ్లి చూస్తారని, ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని” తెలిపారు.
కాల భైరవ మాట్లాడుతూ.. ‘దొంగలున్నారు జాగ్రత్త’ కోసం ఈక్వెల్ టీం వర్క్ చేశాం. తెలుగులో వస్తున్న మొదటి సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఇది. ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇలాంటి సినిమా తెలుగు ఎప్పుడూ రాలేదు. ఈ సినిమా ఇచ్చే అనుభూతి ఇది వరకూ మరే సినిమా ఇవ్వలేదని భావిస్తున్నాను. గొప్ప సినిమా అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసుకున్న తర్వాత నా పట్ల చాలా గర్వంగా ఫీలయ్యాను. సెప్టెంబర్ 23న సినిమా చూసిన తర్వాత మీరూ కూడా ఒక గొప్ప సినిమా చుశామనే అనుభూతిని పొందుతారు” అన్నారు.
సునీత తాటి మాట్లాడుతూ.. ‘దొంగలున్నారు జాగ్రత్త’ చాలా కొత్త అనుభవం. ఇలాంటి కొత్త చెప్పాలని సురేష్ బాబు, నేను నిర్ణయించుకున్నాం. సతీష్ చాలా విజన్ వున్న దర్శకుడు. ‘దొంగలున్నారు జాగ్రత్త’ చాలా కొత్త వుంటుంది. ప్రేక్షకులు ఇంతకుముందు ఎప్పుడూ చూడని అనుభవాన్ని ఇస్తుంది. సినిమా యూనిట్ అంత చాలా కమిటెడ్ గా చేశారు. శ్రీసింహ ఇందులో చాలా వైవిధ్యంగా నటించారు. రాజు పాత్రని అద్భుతంగా పోషించాడు. భవిష్యత్ లో సింహతో కలసి మరిన్ని సినిమాలు చేయాలనీ వుంది. ప్రీతి అస్రాణి ఈ చిత్రంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కథలో ఆమె పాత్ర ఒక టైం లైన్ గా వుంటుంది. సముద్రఖని పాత్ర కూడా చాలా అద్భుతంగా వుంటుంది. కాల భైరవ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. డీవోపీ యశ్వంత్ సి, ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నడికుడికర్ మిగతా సాంకేతిక నిపుణులు బ్రిలియంట్ వర్క్ చేశారు. ఈ సినిమా చేసినందుకు చాలా గర్వంగా వుంది. చాలా యూనిక్ మూవీ ఇది. సెప్టెంబర్ 23 థియేటర్లోకి వస్తుంది. తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి” అని కోరారు.
సతీష్ త్రిపుర మాట్లాడుతూ.. నాపై నమ్మకం వుంచిన నిర్మాతలు సురేష్ బాబు, సునీత గారికి కృతజ్ఞతలు. రామానాయుడు ఫిల్మ్ స్కూల్ కెరీర్ మొదలుపెట్టి సురేష్ ప్రొడక్షన్స్‌ తో దర్శకుడిగా పని చేయడం ఆనందంగా వుంది. సురేష్ బాబు గారు ఎంతగానో సపోర్ట్ చేశారు. వెంకటేష్ గారు దృశ్యం సినిమాకి కూడా అసోసియేట్ గా పని చేశాను. దొంగలున్నారు జాగ్రత్త’ నేను చేస్తున్నానని తెలిసి ఆయన కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. సునీత గారు ఈ చిత్రానికి బ్యాక్ బోన్. ఈ కథని డెవలప్ చేయడానికి రవి గారు చాలా సపోర్ట్ చేశారు. ఆయనకి కృతజ్ఞతలు. శ్రీసింహ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. తెరపై అది కనిపిస్తుంది. ఈ సినిమా శ్రీసింహ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ప్రీతి అస్రాణి పాత్ర కూడా బ్రిలియంట్ గా వుంటుంది. శ్రీకాంత్ అయ్యంగర్ మరో ముఖ్యమైన పాత్ర చేశారు. ఆయన అనుభవం మాకు చాలా ఉపయోగపడింది. సముద్రఖని పాత్ర చాలా సర్ప్రైజింగ్ గా వుంటుంది. ఆయన ఈ సినిమా చేసినందుకు కృతజ్ఞతలు. ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నడికుడికర్ గారు అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు. డీవోపీ యశ్వంత్ బ్రిలియంట్ విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమాతో ఆయన వర్క్ కి చాలా మంచి పేరు వస్తుంది. కాల భైరవ మ్యూజిక్ ఈ సినిమా మరో స్థాయికి తీసుకెళుతుంది. ఎడిటర్ గ్యారీ బీ హెచ్ కి థాంక్స్. లుగులో వస్తున్న మొదటి సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఇది. మంచి థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. సెప్టెంబర్ 23 థియేటర్లోకి వస్తుంది. తప్పకుండా చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
ప్రీతి అస్రాణి మాట్లాడుతూ.. ‘దొంగలున్నారు జాగ్రత్త’ చాలా స్పెషల్ ఫిలిం. ఈ కథ విన్నపుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఇలాంటి కథ, కాన్సెప్ట్ ఎప్పుడూ వినలేదు. తెలుగులో వస్తున్న మొదటి సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో నీరజ అనే పాత్రలో కనిపిస్తాను. కథలో చాలా బలమైన పాత్రది. చాలా సర్ప్రైజ్ గా వుంటుంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. సురేష్ బాబు, సునీత గారికి కృతజ్ఞతలు. శ్రీ సింహ తో పని చేయడం ఆనందంగా వుంది. కాల భైరవ అద్భుతమైన సంగీతం అందించారు. సెప్టెంబర్ 23 కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. చాలా యూనిక్ కంటెంట్. తప్పకుండా అందరూ థియేటర్లో చూడాలి. మీ అందరికీ నచ్చుతుంది” అని కోరారు.
శ్రీకాంత్ అయ్యంగర్ మాట్లాడుతూ.. ఇది చాలా స్పెషల్ మూవీ. ఈ సినిమా అవకాశం ఇచ్చిన సురేష్ బాబు, సునీత గారికి గారికి థాంక్స్. ఈ సినిమా కోసం చాలా ప్రొఫిసినల్ గా ఒక యూనిట్ గా పని చేశాం. శ్రీ సింహ లో నటనపట్ల చాలా కసి వుంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలి” అని కోరారు.
డీవోపీ యశ్వంత్ సి మాట్లాడుతూ.. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ లో పని చేయడం ఆనందంగా వుంది. సింహ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. 15 కీలలో బరువుతగ్గించారు. ఇది చాలా స్పెషల్ మూవీ. ఈ సినిమా అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు.
ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నడికుడికర్ మాట్లాడుతూ.. ‘దొంగలున్నారు జాగ్రత్త’ చిత్రానికి పని చేయడం ఒక సవాల్. ఒకటే లొకేషన్ కోసం చాలా రిసెర్చ్ చేశాం. చివరిగా స్టూడియోలో భారీ సెట్ వేసి చేశాం. హీరో శ్రీ సింహ, కాల భైరవ తో పాటు చిత్ర యూనిట్ తో పని చేయడం మంచి అనుభవం. ఈ సినిమాకి అవకాశం ఇచ్చిన సురేష్ ప్రొడక్షన్స్‌, సునీత తాటి గారికి థాంక్స్” చెప్పారు.
తారాగణం: శ్రీ సింహ కోడూరి, ప్రీతి అస్రాణి, సముద్రఖని
సాంకేతిక విభాగం:
దర్శకత్వం : సతీష్ త్రిపుర
నిర్మాతలు: డి సురేష్ బాబు, సునీత తాటి
బ్యానర్లు: సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ , మంజార్ స్టూడియోస్
సంగీతం: కాల భైరవ
డీవోపీ: యశ్వంత్ సి
ఎడిటర్: గ్యారీ బీ హెచ్
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్
సహ నిర్మాతలు: యువరాజ్ కార్తికేయన్, చిత్రా సుబ్రమణ్యం, వంశీ బండారు
లైన్ ప్రొడ్యూసర్: రామ బాలాజీ డి
పీఆర్వో: వంశీ-శేఖర్