దొంగ ఓటేయడానికి వస్తే చర్యలు

పోలీసులు హెచ్చరిక
హైదరాబాద్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి):  ప్రలోభాలకు గురై దొంగ ఓటు వేసేందుకు వస్తే దొరికి పోక తప్పదని  పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా దొంగ ఓటు వేయడానికి వస్తే ఇట్టే దొరికి పోతురని అన్నారు.  దొంగ ఓటు వేస్తే చట్ట పరిధిలో కఠిన శిక్షలు ఉన్నాయని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. దొంగ ఓటుకు పాల్పడి ఆ
నేరం రుజువైతే ఆరు నెలల నుంచి ఏడు ఏండ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని పోలీసు అధికారులు వివరిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఓటర్లు వారి ఓటు హక్కును మాత్రమే వినియోగించుకోవాలని, ఇతరు ఓటు వేసేందుకు ప్రయత్నించొద్దని పోలీసులు సూచిస్తున్నారు. దొంగ ఓటు నమోదుపై వచ్చే ఫిర్యాదుల విూద ఫోర్జరీ, రిప్రెజంటేషన్‌ ఆఫ్‌ పీపుల్స్‌ యాక్ట్‌-1951, ఐపీసీ 464 కింద కేసులు నమోదవుతున్నాయని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో డబ్బులకు ఆశపడి, రాజకీయ ప్రేరణలకు ఎవరు గురికావద్దని పోలీసు అధికారులు తెలిపారు. ఎవరి ఓటును వారే వేయాలని, ఇతరుల ఓటు వేయడానికి ప్రయత్నించవద్దన్నారు.