దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు కృషి చేయాలి : జీఎంపీఎస్

మద్దూరు (జనంసాక్షి) జులై 04 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం మద్దూరు మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆలేటి యాదగిరి ముఖ్యఅతిథిగా పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాడు తెలంగాణ సంస్థానంలో భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం దున్నవాడికే భూమి కావాలని జరిగిన సాయిధ పోరాటంలో గొర్ల కాపరి అయిన దొడ్డు కొమురయ్య అగ్రభాగాన నిలబడి పోరాటం గావించాడని ఆ పోరాటంలో దొరసాని గుండాలు తుపాకీ గుండ్లకు కొమురయ్య బలయ్యాడని ఆయన మరణం నాడు తెలంగాణ వ్యాప్తంగా సాయుధ పోరాటం అగ్ని కిళల ఎగిసి పడిందని దానితో తెలంగాణ సాయుధ పోరాటం జయప్రదమైందని, ఆ తర్వాత జరిగిన మళ్లీ దశ తెలంగాణ ఉద్యమంలో యువకులు మేధావులు విద్యార్థులు కోమరయ్య స్ఫూర్తితో జరిగిన పోరాటం వల్ల తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండి పై ఏర్పాటు చేస్తానని అలాగే వర్ధంతిని అధికారికంగా జరుపుతామని గాలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను తుంగలో తొక్కారని అన్నారు. సిద్దిపేట పట్టణంలో అనేకమంది మేధావుల విగ్రహాలను ఏర్పాటు చేసి కొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోవడం వివక్షతకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కండ్లు తెరిచి వర్ధంతిని అధికారికంగా జరపాలని ట్యాంక్ బండ్ పై, సిద్దిపేట పట్టణంలో విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఇరుమళ్ల ప్రశాంత్, జక్కుల ఎల్లయ్య, నాయకులు ఆల్ద నరసయ్య,బాలమల్లు, ఆల్ద శ్రీశైలం, మల్లేశం, నర్సయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Attachments area