దోపిడి దొంగల పార్టీలను భూస్థాపితం చేద్దాం
*భూమికోసం భుక్తి కోసమే పోరాటం
*గడిలా పాలన బద్దలు కొడుతాం
*మునుగోడు గడ్డపై నీలి జెండా ఎగురవేస్తాం
*చట్టం అందరికీ ఒకే తీరుగా ఉండాలి ఉండాలి
*బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
మునుగోడు సెప్టెంబర్20(జనంసాక్షి):
మునుగోడులో దోపిడి దొంగల పార్టీలను భూస్థాపితం చేసి బహుజన రాజ్యాధికారం మునుగోడు గడ్డపై బహుజనుల జెండా ఎగరవేయడం కోసం పోరాడాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు మంగళవారం మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించిన బహుజన రాజ్యాధికార యాత్ర రెండవ విడత సభలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజల పక్షాన ఎన్నడు మాట్లాడని రాజగోపాల్ రెడ్డి మూడున్నర సంవత్సరాలలో మునుగోడు ప్రజల కోసం ఏం చేశారని చెప్పిన తర్వాతే మునుగోడు ప్రజల ఓట్లను అడగాలని అన్నారు బీజేపీ తో రాజగోపాల్ రెడ్డి కుదుర్చుకున్న కాంట్రాక్ట్ లను మునుగోడు ప్రజలకు పంచాలని అదేవిధంగా తన కంపెనీలో మునుగోడులో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన తర్వాతే మునుగోడులో అడుగు పెట్టాలని హెచ్చరించారు.
గుజరాత్ లో ఖైదీలకు సన్మానం చేసిన బిజెపి నేతలను మునుగోడు తిప్పడం రాజగోపాల్ రెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్నవన్నీ ఎండగట్టకు తప్పదని అన్నారు. గత ఎనిమిదేళ్లలో ఫామ్ హౌస్ పరిమితమై ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మునుగోడు ఉప ఎన్నికల్లో రాత్రికి రాత్రి రోడ్లు భవనాలు వేస్తూ ప్రజలను మభ్యపెడుతూ డబ్బు సంచులతో ఓట్లు అడగడానికి వస్తు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దళిత బంధుతో దళితులను దగా చేస్తూన కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి బహుజన రాజ్యాధికారాన్ని ఏనుగుపై ప్రగతి భవన్ కు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో
రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ మంద ప్రభాకర్,కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయనంద్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు యెర్రా కామేష్,కందికంటి విజయ్ కుమార్,నిషాని రాంచంచంద్రం,డిప్యూటి మేయర్ ఇబ్రహీం శేఖర్,మహతి రమేష్, జడి రాజు,వెంకటేష్ చౌహన్,,జిల్లా అధ్యక్షుడు పుదారి సైదులు,అనిత రెడ్డి,నర్రా నిర్మల,అసెంబ్లీ అధ్యక్షుడు పల్లె లింగస్వామి,ఆందోజు శంకరా చారి,మాల్గా యాదయ్య,మండల అధ్యక్షులు పందుల హరీష్,పి.సురేష్, తీగల రమేష్,వెంకన్న,జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు