దోమలో దారుణం.

భూతగాదాలతో వ్యక్తి దారుణ హత్య
తమ్ముడు పై రోకలి బండతో  అన్న భార్య,అన్న కొడుకు దాడి
మృతి చెందిన తమ్ముడు
దోమ డిసెంబర్ 3(జనం సాక్షి)
భూతగాదాలతో ఓ వ్యక్తి హతమయ్యాడు. భూమి అమ్మిన డబ్బుల విషయంలో అన్నదమ్ముల గొడవ పడి తమ్ముడిని రోకలి బండతో కొట్టి చంపిన సంఘటన దోమ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండయిపల్లి  గ్రామంలో శుక్రవారం రాత్రి  చోటుచేసుకుంది.దోమ ఎస్ఐ విశ్వజన్, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం….మండల పరిధిలోని కొండయిపల్లి గ్రామానికి చెందిన నెత్తి బాలరాజ్,నెత్తి నర్సింలు ఇద్దరు అన్నదమ్ములు తమ తల్లిదండ్రుల పైన ఉన్న 13 గుంటల భూమిని 7,47,500 రూపాయలకు ఇతరులకు విక్రయించారు. అడ్వాన్స్ కింద రెండు లక్షలు ఇవ్వగా అన్న బాలరాజ్1,80,000 రూపాయలు తీసుకొని, తమ్ముడు నరసింహులు 20వేల రూపాయలు ఇచ్చాడు. డబ్బుల విషయం, భూమి సరిగ్గా పంచలేదని అన్నతో తమ్ముడు తరచూ గొడవ పడుతుండేవాడు. శుక్రవారం రాత్రి భూమి అమ్మిన డబ్బుల విషయంలో ఇద్దరు అన్నదమ్ములు గొడవపడి,గొడ్డలితో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు, ఇద్దరికీ గాయాలయ్యాయి. బాలరాజ్ కొడంగల్ లో నివాసం  ఉంటున్న తన భార్య సునీత,కొడుకు హరి కి తనకు గాయపైన విషయం ఫోన్లో తెలిపాడు. వారు కోపంతో కొండయిపల్లి గ్రామానికి చేరుకొని అప్పటికే నిద్రపోతున్న నర్సింలు ని రోకలి బండతో దాడి చేయగా నర్సింలు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆస్తిని కాజేయడానికి నర్సింలు చావు కారణమైన హరి, సునీత, బాలరాజ్ లపై చర్యలు తీసుకోవాలని మృతుడి బావ నల్లి బాబయ్య దోమ పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుఎస్ ఐ విశ్వజన్ తెలిపారు.