దోమల నివారణ కోసం ప్రత్యేక కార్యచరణ.

పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
మంబాపూర్ గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్.
తాండూరు జులై 26(జనంసాక్షి)వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని మంబాపూర్ గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్ వేల్లడించారు. మంగళవారం పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో ఎంపీ సుష్మా ఆధ్వర్యంలో వర్షపు నీరు నిల్వ ఉన్నచోట దోమలను నివారించేందుకు ఆయిల్ బాల్స్ మందులు పిచికారి చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తగా దోమల నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.తమ తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఇంటి చుట్టుముట్టు నీటి నిల్వలు ఉండకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. అదేవిధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల గ్రామంలో తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్, వార్డ్ మెంబెర్స్ మొహిడ్, కిరణ్ శ్రీనివాస్,ప్రజా ప్రతినిధులు. గ్రామస్తులు.అధికారులు తదితరులు పాల్గొన్నారు.