దౌల్తాబాద్ వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందాలి: ఎమ్మెల్సీ యాదవ రెడ్డి

దౌల్తాబాద్, ఆగస్టు 25,జనం సాక్షి.
మండల కేంద్రమైన దౌల్తాబాద్ వ్యాపార కేంద్రంగా అభివృధ్ది చెందాలని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అన్నారు.గురువారం దౌల్తాబాద్ లో జస్ టీ టీ పాయింట్ ను ప్రారంభించారు. అనంతం ముబారాస్ పూర్ ఎంపీటీసీ తిరుపతి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతం గ్రామానికి చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటినుండి ఎనిమిది సంవత్సరాలుగా ఎన్నో అభివృధ్ది కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత తెరాస ప్రభుత్వానికి దక్కింది అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్, జిల్లా కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ రహీమొద్దిన్, వైస్ ఎంపీపీ అల్లి శేఖర్ రెడ్డి, ఏఏంసీ ఛైర్మన్ శ్రీనివాస్ గుప్త, పిఏసీఎస్ ఛైర్మన్ వెంకట్ రెడ్డి,రైతుబందు మండల అధ్యక్షులు స్టీవెన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బండారు దేవేందర్, ఉప సర్పంచ్ యాదగిరి, మాజీ సర్పంచులు చిక్కుడు సత్యనారాయణ,మోహన్ రావు,నాయకులు , జనార్ధన్ రెడ్డి, ఇప్ప దయాకర్, చిక్కుడు మహేష్ వార్డ్ మెంబర్ మాశెట్టి నరేష్, జస్ టీ దుకాణ నిర్వాహకులు,తదితరులు పాల్గొన్నారు

.