ద్రవ్యలోటు పరిష్కరిస్తాం కఠిన చర్యలు తీసుకుంటాం
జీ20 శిఖరాగ్ర సభలో ప్రధాని
లాస్ కాబోస, జూన్ 19: భారత్ ఆర్థికాభివృద్ధి 9 శాతానికి చేరుకునేందుకు ప్రభుత్వం అన్ని కఠిన చర్యలు తీసుకుంటుందని, వాటిలో రాయితీలు ఎత్తివేయటం, ద్రవ్యలోటు విస్తరించటాన్ని వెనక్కు మరలించటం ఉన్నాయని చెప్పారు.ఆర్థికాభివృద్ధి మందగించడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాల శీఘ్రకల్పనకు అభివృద్ధి ఇంకా వేగంగా జరిగేందుకు దేశం ఎదురు చూస్తోం దన్నారు. దేశంలో ఇన్వెస్టర్ సెంటిమెంటును పునరుజ్జీవింపజేసేందుకు చర్యలు తీసుకుంటు న్నామన్నా రు. జి.20 శిఖరాగ్ర సమావేశంలో ఆయన మంగళవారం మాట్లడారు. ”ఇతర దేశాల మాదిరి మేం కూడా ద్రవ్యలోటును 2008 వరకు విస్తరింపజేసేందుకు అనుమతించారు.ఉద్దీపన కలిగించటం ఈ చర్య లక్ష్యం. అయితే ఇపుడు దీన్ని వెనక్కు మరలించడం పై దృష్టి సారిస్తున్నాం. ఇందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఉంటుంది. సబ్సిడీలను రద్దు చేయాల్సి ఉంటుంది. ఈ విషయమై కృతనిర్చయం తో ఉన్నాం.” అని ఆయన చెప్పారు. ఈ సమావేశానికిఅమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా హాజర య్యారు. ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తిలో ద్రవ్యలోటు 5.1శాతం మాత్రమే ఉండేందు కుభారత్ లక్ష్యంగా పెట్టుకుంది.కాని సబ్సిడీ బిల్లు అధికం కావటం, పన్ను ద్వారా లభించే ఆదాయం తక్కువ కావటం తో 2011-2012 సంవత్సరానికి అనుకున్న ఫలితాలు రాలేదు. 2011-2012లో ద్రవ్యలోటు 5.8శాతంగా ఉంది.ముందుగా వీనా లక్ష్యం 4.6శాతం గా మాత్రమే పెట్టుక్నుప్పటికీ ఆర్ధికాభివృద్ధి పై ప్రభావం చూపుతుంది.2011-2012నాలుగవ త్రైమాసికంగాలో దేశ ఆర్థికాభివృద్ది 5. 3 శాతానికి చేరింది. గత 9 సంవత్సరాలలో ఇది అత్యంత కనిష్టం. అంతర్గత సమస్యలు కూడా పని తీరు పై ప్రభావం చూపాయని వీటిని అధికమించేందుకు తాము కృషి చేస్తున్నాయని ప్రధాని చెప్పారు.