ద్రవ్యోల్బణాన్ని జయించాం

న్యూఢిల్లీ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంటే…భారత్‌ ద్రవ్యోల్బణాన్ని జయించిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు.  వృద్ధి రేటును త్వరలోనే రెండంకెలకు తీసుకు వెళతామన్నారు. ఇతర దేశాలతో పోల్చితే రూపాయి బలపడిందని జైట్లీ తెలిపారు. ఆర్థిక క్రమ శిక్షణ కత్తివిూద సాములాంటిదేనని ఆయన అన్నారు.  రాయితీల్లోని లోపాలు సవరిస్తామే కానీ…రాయితీలు కాదని జైట్లీ పేర్కొన్నారు.  రాష్టాల్రను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామని ఆయన తెలిపారు. . పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నామన్నారు.  75వ స్వాతంత్య దినోత్సవం నాటికి భారత్‌ శక్తివంతమైన దేశంగా మారుతుందన్నారు.  వృద్ధి రేటును త్వరలోనే రెండంకెలకు తీసుకు వెళతామన్నారు. ఇతర దేశాలతో పోల్చితే రూపాయి బలపడిందని జైట్లీ తెలిపారు. ఆర్థిక క్రమ శిక్షణ కత్తివిూద సాములాంటిదేనని ఆయన అన్నారు.  రాయితీల్లోని లోపాలు సవరిస్తామే కానీ…రాయితీలు కాదని జైట్లీ పేర్కొన్నారు.  పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నామన్నారు.

2022 నాటికి అందరికీ ఇళ్లు

లోక్‌ సభలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ ప్రసంగం కొనసాగుతోంది. భారత్‌ ఆర్థిక వృద్ధికి  ప్రజల భాగస్వామ్యం కావాలన్నారు. 2022 నాటికి భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 75 ఏళ్లవుతుంది..అప్పటికి దేశంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. ట్టణ భారతంలో 2 కోట్ల ఇళ్లు, గ్రావిూణ భారతంలో 4 కోట్ల ఇళ్లు కట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రితెలిపారు. ప్రతి ఇంటికీ 24 గంటల విద్యుత్‌ సరఫరా, నీటి సరఫరా ఉండాలని అనుకుంటున్నాం. దేశంలో మిగిలిన 20 వేల గ్రామాలకు కూడా విద్యుత్‌ సరఫరా కోసం సౌర విద్యుత్‌ కల్పించాలని భావిస్తున్నాం.   అలాగే  ఆరు కోట్ల టాయిలెట్లను నిర్మించాలన్న తమ  ప్రభుత్వ టార్గెట్‌ ను రీచ్‌ అయ్యేందుకు కృషిచేస్తున్నామన్నారు. ఇప్పటికే 50  లక్షల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని ప్రకటించారు.

అంతరాలు తొలగిస్తాం

దేశంలో పట్టణ, గ్రావిూణ ప్రాంతాల మధ్య అంతరాలు తొలగిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. దేశంలో ఎక్కువ జనాభా 35 సంవత్సరాల కంటే తక్కువగా వున్న వయస్సు వున్నవారే.  మేకిన్‌ ఇండియా పథకం కింద వీరి శక్తిని ఉపయోగించుకుంటే ప్రపంచంలోనే మనదేశం తయారీ కేంద్రంగా మారుతుంది.  స్కిల్‌ ఇండియా పథకం కింద నైపుణ్యంతో కూడిన శిక్షణ అందిస్తాం.ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో మనది ఒకటని అరుణ్‌ జైట్లీ చెప్పారు. ఏటా మనం 800-1000 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటామని, అయితే ఇది ఎక్కడా ట్రేడింగ్‌ కావట్లేదని అన్నారు. ఇందుకోసం గోల్డ్‌ డిపాజిట్ల స్థానంలో గోల్డ్‌ మినిమైజ్‌ అనే కొత్త పథకం ప్రవేశపెడతామన్నారు. బంగారాన్ని డిపాజిట్‌ చేసుకుంటే ఆదాయం కూడా వస్తుందని, గోల్డ్‌ బాండ్‌ కొనుగోలు చేస్తే దానికి నిర్దేశిత వడ్డీ ఇస్తామని అన్నారు. అలాగే కొత్తగా అశోక చక్ర పేరుతో ఇండియన్‌ గోల్డ్‌ కాయిన్స్‌ ముద్రిస్తామని జైట్లీ చెప్పారు. దీనివల్ల విదేశాల్లో ముద్రించే బంగారానికి డిమాండ్‌ తగ్గుతుందన్నారు. నల్లధనాన్ని నియంత్రించడానికి క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ఉపయోగానికి మరిన్ని ప్రోత్సాహకాలు కల్పిస్తామని, క్యాష్లెస్‌ ఇండియా రూపొందించడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు