‘ద్వి’రాట్

విరాట్ కెప్టెన్సీలో భారత్ టెస్టు క్రికెట్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అంతేకాదు న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. టెస్టుల్లో అగ్రస్థానం సాధించడంతో ఇండోర్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం విరాట్ ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు. అదే టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్న జట్టుకు ఐసీసీ ప్రతిష్ఠాత్మకంగా అందించే గదను అందుకోవడం. ఈ సందర్భంగా కోహ్లి ట్విటర్ వేదికగా ‘నా సోదరులతో కలిసి ఇది మరిచిపోలేని క్షణం.. అద్భుత విజయం, ఐసీసీ గద సాధించడం, టెస్టుల్లో నంబర్ వన్ స్థానం దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది. సహచర ఆటగాళ్ల వల్ల నేనెంతో గర్వంగా ఫీలవుతున్నా’నంటూ పేర్కొన్నాడు. అలాగే ఐసీసీ ఛాంపియన్‌షిప్ గదను అందుకున్న అనంతరం సహచర ఆటగాళ్లతో కలిసి ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.
