ధరణిని రద్దు చేయాలి.. సీసీఎల్‌ఏను పునరుద్ధరించాలి : కాంగ్రెస్

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ దగ్గర పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తర్వాత జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ధరణిని రద్దు చేసి పాత పద్దతిలో సీసీఎల్‌ఏను పునరుద్ధరించాలని కాంగ్రెస్‌ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ముత్యంరెడ్డి, అయ్యన్నగారి పోశెట్టి, దిలావర్ పూర్ జడ్పీటీసీ రమాణారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాందేడపు చిన్ను, పార్టీ మండల అధ్యక్షులు జమాల్, ఇంద్రకరణ్ రెడ్డి, కౌన్సిలర్లు ఇమ్రానుల్లా, శంకర్ పతి, ముథోల్ కాంగ్రెస్ నాయులు ఆనందరావు పటేల్, యూత్ కాంగ్రెస్ నాయకులు చరణ్ మౌర్య , ప్రజ్యూత్ రావు, ఉదయ్, మైనార్టీ నాయకులు షహీమ్, మెయిన్, కీజర్, రఫీ, హర్షద్ ఎన్ ఎస్ యూ ఐ కార్యకర్తలు పాల్గొన్నారు