ధరణి పోర్టల్ లోపాలను సవరించాలి*
సీపీఎం జిల్లా కార్యదర్శి మిలుకురి వాసుదేవరెడ్డి
కరీంనగర్ టౌన్ అక్టోబర్ 17(జనం సాక్షి)
రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో లోపాలను సవరించి భూ సమస్యలను పరిష్కరించాలనిసీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిలుకురి వాసుదేవరెడ్డి ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంతీసుకొచ్చిన ధరణి వెబ్సైట్లో అనేక లోపాల కారణంగారైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ధరణిలో 22 అంశాలకుగాను11 అంశాలను ధరణిలో చేర్చడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆయన అన్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలని, ధరణిలో లోపాలను సవరించాలని, సమస్యలను పరిష్కరించాలని, రైతులు పండించిన అన్నిరకాల పంటలకు గిట్టుబాటు రేటు కల్పించాలని వారికి కేరళ ప్రభుత్వం ఇచ్చిన బోనస్ మాదిరిగా 700 రూపాయలు బోనస్ ఇవ్వాలని ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు సెంటర్లు వెంటనే ప్రారంభించాలని ఎలాంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.