ధరణి భూ సమస్యలు పరిష్కరించాలని తహసీల్ దార్ కార్యాలయం ముందు ధర్నా

పెంట్లవెల్లి (జనం సాక్షి)  అక్టోబర్ 13 పెంట్లవెల్లి మండల కేంద్రం లో  తహసిల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ రైతు సంఘం పెంట్లవెల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ధరణి సమస్యలు రైతాంగ సమస్యలు పరిష్కరించాలని గురువారం రోజు ధర్నా నిర్వహించి తహసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాసులు హాజరై మాట్లాడుతూ ధరణి వచ్చినప్పటి నుండి జిల్లా వ్యాప్తంగా రైతులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతూ కేసులు పెట్టుకుని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారని తక్షణమే ప్రభుత్వము ధరణి లోని లోపాలను సవరించి రైతుల భూ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు మంత్రివర్గ ఉప సంఘం సూచించిన సూచనల ప్రకారం లోపాలను సవరించి రైతుల భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరారు పెంట్లవెల్లి మండలంలో ఎక్కువగా కవులు రైతులు ఉన్నారని వారిని గుర్తించి ప్రభుత్వము కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి బ్యాంకుల నుండి పంట రుణం తీసుకునే విధంగా ప్రయత్నించాలని ఆయన కోరారు కవులు సైతం జిల్లాలో ఒకరకంగా లేదని ప్రభుత్వమే చొరవ తీసుకొని జిల్లా అధికారులు ఆయా పంటలకు జిల్లా అంతట ఒకే రకమైన కవులు ఉండే విధంగా నిర్ణయించాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా లక్ష రుణమాఫీ చేస్తామని నేటికి చేయకపోవడం వలన రైతులు బ్యాంకులకు వడ్డీలు చెల్లిస్తున్నారని కొత్త రుణాలు సైతం అందడం లేదని లక్ష రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు కొల్లాపూర్ ప్రాంతంలో ప్రభుత్వము మామిడి కొనుగోలు మార్కెట్ ప్రారంభిస్తామని నేటికి ప్రారంభించకపోవడం విడ్డూరమని రాబోయే మామిడి సీజన్ కల్లా మార్కెట్ను ప్రారంభించి మామిడి రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు ఇటీవల వర్షాల వలన మొక్కజొన్న ప్రతి మిర్చి పంటలు వేసే రైతులు నష్టపోయారని జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ వ్యవసాయ శాఖ జాయింట్ సర్వే నిర్వహించి నష్టపోయిన రైతులకు ఎకరానికి వాణిజ్య పంటలకు  రూ,        40 000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి ఎల్లా గౌడ్ జిల్లా నాయకులు కురుమయ్య పి శివశంకర్ హనుమంతు రైతులు పాల్గొన్నారు.