ధరలపై చర్చకు పట్టుబడితే సస్సెన్షనా
టిఆర్‌ఎస్ ఎంపిల స్స్సెన్షన్‌పై కెటిఆర్ ట్వీట్
హైదరాబాద్,జూలై27(జనంసాక్షి ): రాజ్యసభ నుంచి టీఆర్‌ఎస్ ఎంపీల సస్సెన్షన్ సిగ్గుచేటని మంత్రి కేటీఆర్ అన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతు న్నదని ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ’ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిత్యావ సరాల విూద జీఎస్టీ పెంపుపై చర్చకు అంగీకరించకుండా కేంద్ర ప్రభుత్వం టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలను రాజ్యసభ నుంచి 10 రోజుల పాటు సస్పెండ్ చేయాలని నిర్ణయించడం సిగ్గుచేటు. ప్రభుత్వం చర్చకు ఎందుకు భయపడుతున్నది. ప్రతిపక్షాల గొంతు నొక్కడం ఎందుకు’ అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. జీఎస్టీ, అధిక ధరలు, ద్రవ్యోల్బణంపై రాజ్యసభలో నిరసన తెలిపిన 19 మంది విపక్ష సభ్యులను డిప్యూటీ చైర్మన్ వారం రోజులపాటు సస్పెండ్ చేశారు. వీరిలో టీఆర్‌ఎస్‌కు చెందిన బడుగుల లింగయ్య యాదవ్, దీవకొండ దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర కూడా ఉన్నారు. మిగిలిన 16 మందిలో ఏడుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు, ఆరుగురు డీఎంకే ఎంపీలు, ఇద్దరు సీపీఎం ఎంపీలు, ఒక సీపీఐ ఎంపీ ఉన్నారు.