ధర్మపురి లోని క్యాంప్ కార్యాలయంలో కరపత్రాలు ఆవిష్కరించిన: బిఆర్ఎస్ నాయకులు
ధర్మపురి (జనం సాక్షి న్యూస్) ఎల్ ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ధర్మపురి లోనీ మంత్రి కొప్పుల ఈశ్వర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్ సహకారంతో నియోజకవర్గ యువతీ యువకులకు ఇంగ్లీషులో పట్టు సాధించేలా ఈజీ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించిన ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, వైస్ చైర్మన్ రామన్న, జడ్పిటిసి బత్తిని అరుణ నాయకులు మాట్లాడుతూ,ఉన్నత చదువులు చదవాలన్నా, ఉద్యోగావకాశాలు పొందాలన్నా, పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలన్నా, వ్యాపారాభివృద్ధి చేయాలన్నా, పిల్లల ఇంగ్లీష్ మీడియం చదువులను పర్యవేక్షించాలన్నా, ఆంగ్ల భాష, ప్రావీణ్యం అవసరం. అనివార్యం! గ్రామీణ ప్రాంతంలో నివసించే యువతీ యువకులకు, గృహిణులకు, ఉద్యోగులకు, వ్యాపారస్తులకు ఎంతో మందికి ఇంగ్లీషులో మాట్లాడాలనే కోరిక ఉన్నా, నేర్చుకోవాలనే తపన ఉన్నా, నేర్చుకోవడానికి అవకాశాలు లేక ఇంగ్లీషులో మాట్లాడాలనే కోరిక కలగానే మిగిలిపోతోంది. ఈ అవసరాన్ని గుర్తించే.ధర్మపురి నియోజకవర్గ యువతీ యువకులకు ఇంగ్లీషులో మాట్లాడేలా శిక్షణ ఇచ్చి వారిని స్వయం సాధికారిత దిశగా నడిపించే ఏకైక లక్ష్యంతో సంకల్పించించే ఈ ఇంగ్లీష్’ శిక్షణ కార్యక్రమం.ఉచిత స్టడీ మెటీరియల్ : మూడు దశాబ్దాల అపార అనుభవంతో సులభమైన పద్ధతులతో తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది విద్యార్థులను ఇంగ్లీషులో మాట్లాడేలా తీర్చిదిద్దిన ‘మేధా లాంగ్వేజ్ థియేటర్’ ఫౌండర్ అండ్ చీఫ్ కోచ్ డా। చిరంజీవి రచించిన “ఈజ్ ఇంగ్లీష్” స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇవ్వబడును.మేధా లెర్నింగ్ యాప్ ద్వారా వేల రూపాయల విలువైన స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఉచితంగా మీ మొబైలు అందించబడును ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించబడిన మేధా లెర్నింగ్ యాప్ ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ – శిక్షణ కార్యక్రమం నిర్వహించబడును.
విద్యార్థులూ, ఉద్యోగులూ, వ్యాపారస్తులూ, గృహిణులూ.. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వారు ఎవరైనా.. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ ఆర్గనైజింగ్ వారు, ఆకుల రాజేష్, అనంతుల లక్ష్మణ్, గాజుల సత్తయ్య రవీందర్ ఎడ్ల లత, రమాదేవి, శ్వేత, ఆనందం తదితరులు పాల్గొన్నారు.