ధర్మపోరు..


ఆకాశానికి ఎత్తినప్పుడే అనుకున్నం
పాతాళం తొక్కు”పన్నాగ”మేధో పన్నుతావనీ…

పంటితో తీస్తానన్నపుడే పసిగట్టినం
గుండెల్లో “గునప”మేధో దించుతావనీ…

ఎందుకంటే?
లెక్కకుమించి “నాలుక”లున్న జీవివి కదా!
వెన్నెముక లేని “పరాన్న” ప్రాణివి కదా!

అయినా…
న్యాయ సమ్మతమైనవే కదా! కోరింది
మాతృ”సంస్థ” విలీనమే కదా! అడిగింది

మా “బాధ”లేవి పట్టవ్, విన్నపాలేవి గిట్టవ్
పైగా బెదిరింపులకు తెగబడతవ్

ఒంటెత్తు పోకడలతో
నియంతృత్వ “హుకుం” జారిచేస్తావ్

తప్పని తప్పక “పోరు”బాట పడితే…
అణిచివేయ “అధికార” బలాన్ని ప్రయోగిస్తావ్
అక్రమ కేసులతో నిర్బంధాలకు పాల్పడతావ్

త్యాగాల “గడ్డ” మీద పుట్టినోల్లం
ఉద్యమాల “ఉగ్గు” పాలు తాగినోల్లం

మాముందు నీ తాటాకు “చప్పుళ్ళు” చెల్లవ్
మేకపోతు “గాంభీర్యాలు” సాగవ్

సెల్ఫ్ “డిస్మిస్” అంటూ నువ్వు విర్రవీగుతున్నవ్
శత్రు “డెస్ట్రాయ్” అంటూ మేం కదులుతున్నాం

అధికార “కలం” మాత్రమే నీ చెంతనుంది
యావత్ ప్రజా “బలం”మావెన్నంటే నిలిచింది

ఈ “ధర్మ” పోరులో నీ ఆధిపత్య”గడీ”ల
గోడలు బీటలువారుట “నిక్కం”

నీ “నిరంకుశ పాలనాంతంతో
మేం “విజయోత్సవా”లు జరుపుట ఖాయం

             “”””””””””””””
(ఆర్టీసీ ఉద్యోగులపై పాలకుల నిరంకుశ వైఖరి నిరసిస్తూ…)

                    కోడిగూటి తిరుపతి
జాతీయ ఉత్తమ కవి పురస్కార గ్రహీత
Mbl no: 9573929493

తాజావార్తలు