ధవళేశ్వరం వద్ద గోదావరి ఉరకలు

సముద్రంలోకి భారీగా నీటి విడుదల

మరో 24గంటలు వర్షాలకు అవకాశాలు

ధవళేశ్వరం,ఆగస్టు13(జ‌నం సాక్షి): కొన్ని రోజులుగా గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలుకురుస్తుండటంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఆదివారం నుంచి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దాంతో వచ్చే వరదనీటిని నేరుగా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం వరదనీరు క్రమంగా పెరుగుతోందని, ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరలేదన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి మరంతగా వరదనీరు వస్తే పరిస్థితిని పరిశీలిస్తామన్నారు. సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షం ప్రభావం కనిపించింది. మెట్ట ప్రాంతంలో ఓ మోస్తారు నుంచి చినుకులు పడ్డాయి. విలీన మండలాల్లో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఇక్కడ భారీ వర్షపాతం నమోదు కావడంతో ఆదివారం చాలాచోట్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులపై చెట్టు పడి రాకపోకలు చాలాచోట్ల నిలిచిపోయాయి. గత 24 గంటల వ్యవధిలో కూనవరంలో అత్యధికంగా 7.20 సెం.విూ వర్షపాతం నమోదు అయ్యింది. ఎటపాక మండలంలో 6.34 సెం.విూ, వీఆర్‌ పురం మండలంలో 6.24 సెం.విూ, చింతూరు మండలంలో 4 సెం.విూ వర్షపాతం నమోదయ్యింది. విలీన మండలాల్లో పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆదివారం జిల్లావ్యాప్తంగా వర్షాలు కురిశాయి. మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ కలెక్టరేట్‌కు సమాచారం అందించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. తీరం వెంట గంటకు 45 నుంచి 50 కి.విూ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మరో 24 గంటల వరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టరేట్‌ నుంచి ఆయా మండలాల అధికారులు ఆదేశాలిచ్చారు. కోనసీమ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. దీంతో ఇక్కడ జనజీవనానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ ప్రాంతంలోని 16 మండలాల్లో వర్షాల ప్రభావంతో రహదారులు ఛిద్రంగా మారాయి. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో తేలికపాటి వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షం ప్రభావం కనిపించింది. మెట్ట ప్రాంతంలో ఓ మోస్తారు నుంచి చినుకులు పడ్డాయి. విలీన మండలాల్లో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తు న్నాయి. రహదారులపై చెట్టు పడి రాకపోకలు చాలాచోట్ల నిలిచిపోయాయి. రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలు మెట్ట ప్రాంతానికి మేలు చేస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మొక్కజొన్న, పత్తి, అపరాలు, మిర్చి వంటి సాగుకు ఈ వర్షాలు అనుకూలంగా ఉంటాయని వ్యవసాయశాఖ అధికారులు చెప్పారు.

 

తాజావార్తలు