ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలి:తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మూడ్ శోభన్

 మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):వానాకాలం ధాన్యం కొనుగోళ్ళను చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మూడ్ శోభన్ డిమాండ్ చేశారు.
ఆదివారం మెదక్ లోని కేవలం కిషన్ భవనంలో తెలంగాణ రైతు సంఘం మెదక్ జిల్లా 5వ మహాసభ సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి సర్దార్ అధ్యక్షతన జరిగింది. అనంతరం శోభన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్ కు రూ.2040 లు రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదని చెప్పారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం క్వింటాల్ ధాన్యానికి రూ.2707 లు ప్రకటించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా కేరళ ప్రభుత్వం రూ.800 ప్రకటించి క్వింటాల్ ధాన్యాన్ని రూ.2850 లకు కొనుగోలు చేస్తోందన్నారు. కేరళ తరహాలో రాష్ట్రంలో ధాన్యం సేకరణ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే వానాకాలం వరి ధాన్యం చేతికొచ్చింది. వరి కోతకు మిషిన్లు గంటకు 2800 తీసుకుంటున్నారు. కోత మిషన్ల రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాము. కోత మిషన్లు అందుబాటులో లేని చోట అధికార యంత్రాంగం అందుబాటులో ఉంచాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరచి, కొనుగోళ్ళను చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ మార్గదర్శకాలలో ధాన్యం తేమ శాతాన్ని 17 శాతంగా నిర్ణయించారు. కానీ, అంతకు తక్కువ తేమ ఉన్న ధాన్యాన్ని కూడ మిల్లర్లు కొనుగోలుకు అంగీకరించడం లేదు. కొన్ని చోట్ల తేమ శాతాన్ని చూపి కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. పైగా క్వింటాలుకు 5 నుండి 10 కిలోల వరకు తరుగు కింద తగ్గిస్తామంటున్నారు. గత సంవత్సరం మిల్లర్లు, కొనుగోలు కేంద్రాలు ఇదే విధంగా రైతులను మోసగించాయి. తక్షణం ధాన్యం కొనుగోలును చేపట్టాలని, లేకపోతే తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టవలసి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
         నూతన కమిటీ ఎన్నిక తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులుగా ఎండి సర్దార్ (రేగోడు), ఉపాధ్యక్షులుగా బొంత బాగయ్య (పెద్ద శంకరంపేట్), లక్ష్మీనరసయ్య (చేగుంట), కార్యదర్శిగా చింతల గౌరీ (వెల్దుర్తి), సహకార దర్శిగా పాప గాని మధుసూదన్ రెడ్డి (మెదక్) కమిటీ సభ్యులుగా చింతల సత్తయ్య (కొల్చారం), గుమ్ముల రామస్వామి (నిజాంపేట్), పోతురాజు రాజయ్య (హవేలి ఘనపూర్), గోదాల సుధాకర్, తాళ్లపల్లి లింగం (వెల్దుర్తి), సెలిమెటి వెంకట గాంధీ (పాపన్నపేట్) లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Attachments area