ధాన్యం కొనుగోళ్లకు మళ్లీ కష్టాలు
జగిత్యాల,నవంబర్1 (జనంసాక్షి) : దాదాపుగా జిల్లాలోని అన్ని రైస్ మిల్లుల్లో 68 శాతం ధాన్యం బస్తాలు పేరుకపోయి ఉన్నాయి. వానాకాలం కొనుగోళ్లు ప్రారంభం కానుండడంతో ధాన్యాన్ని నిల్వ చేసుకోవడం ప్రశ్నార్థకంగా మారనుంది. జిల్లాలోని 128 రైస్ మిల్లులుండగా ఇందులో 62 రా రైస్ మిల్లులు, 66 ఫారా
బాయిల్డ్ రైస్ మిల్లులు పనిచేస్తున్నాయి. గత యా సంగి సీజన్‌లో కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు జిల్లాలోని రైస్ మి ల్లుల్లో పేరుకపోయి ఉన్నాయి. జిల్లాలోని 62 ఫారా బాయిల్డ్ రైస్‌మిల్లు లు ఒకటి రా రైస్ మిల్లుకు 5,52,961 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధి కారులు సీఎంఆర్ కోసం కేటాయించారు. ఇందులో ఇప్పటివరకు 32 శా తం ధాన్యం గానుగాడిరచారు. మిగిలిన ధాన్యం రైస్ మిల్లుల్లోనే ఉంది. రా రైస్ మిల్లుల సామర్థ్యం అంతంతమాత్రంగా ఉండడం కూడా సమస్యగా మారింది.