ధారావిలో దావానం

` 24 గంటల్లో 42 కరోనా కేసులు

ముంబయి, ఏప్రిల్‌ 28(జనంసాక్షి):ముంబయిలోని ధారవి మురికివాడలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో అక్కడ 42 కొత్త పాజిటివ్‌ కేసు, నాుగు మరణాు నమోదయ్యాయి. దీంతో ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ అయిన ధారవిలో మొత్తం కరోనా కేసు సంఖ్య 330కి పెరిగింది.  దేశంలో అత్యధికంగా కరోనా వైరస్‌ తీవ్రత మహారాష్ట్రలో కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 522కేసు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 8590 పాజిటివ్‌ కేసు నమోదుకాగా 369మంది మృత్యువాతపడ్డారని ప్రభుత్వం వ్లెడిరచింది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఈ వైరస్‌ తీవ్రత ఆందోళనకరంగా ఉంది. పుణె, నాగ్‌పూర్‌లో కేసు సంఖ్య ఎక్కువగా ఉంది. మహారాష్ట్ర అనంతరం అత్యధికంగా కరోనా మరణాు గుజరాత్‌లో చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసు సంఖ్య 3548కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 162మంది ప్రాణాు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోనూ కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 2168 పాజిటివ్‌ కేసు నిర్ధారణ కాగా 110మంది మరణించారు. దేశ రాజధాని దిల్లోలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3108 మందికి కరోనా సోకగా 54మంది మరణించారు.ముంబైలోని ప్రతిష్టాత్మక జేజే ఆస్పత్రిలో నెలాఖరు నాటికి రోజుకు 2200 శాంపిళ్లను పరీక్షించే సామర్ధ్యాన్ని పెంచుతామని అధికాయి పేర్కొన్నారు. ప్రస్తుతం జేజే ఆస్పత్రిలో రోజుకు 100 శాంపిల్స్‌ను టెస్ట్‌ చేస్తున్నారు. పుణేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాజీలో(ఎన్‌ఐవీ) రోజుకు 800 నమూనాను పరీక్షిస్తున్నారు.ముంబైలోని మరో రెండు ప్రభుత్వ ఆస్పత్రు జీటీ, సెంట్‌ జార్జ్‌ ఆస్పత్రును కోవిడ్‌ ఆస్పత్రుగా మార్చారు. అత్యధిక పరీక్షు చేపట్టేందుకు మీగా జేజే ఆస్పత్రిలో ఆర్‌టీ`పీసీఆర్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని, మరో రెండు మూడు రోజుల్లో ఇక్కడ రోజుకు 2200 శాంపిల్స్‌ను పరీక్షించేలా అప్‌గ్రేడ్‌ చేస్తామని వైద్య శాఖ అధికారి వ్లెడిరచారు. వైరస్‌ వ్యాప్తి చెందినప్పటి నుంచి క్ష మందికి పైగా తాము పరీక్షించామని చెప్పారు. వైరస్‌ను నేరుగా గుర్తించే పీసీఆర్‌ టెస్ట్‌పైనే తాము దృష్టికేంద్రీకరించామని, దీంతో సత్వరమే వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించే అవకాశం ఉంటుందని అన్నారు.