ధోని ధనాధన్ ఇన్నింగ్స్
చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం, మెరుపులు మెరిపించిన మైక్ హస్సీ
ధావన్, అమిత్ శ్రమ వృథా హైదరాబాద్‌కు తప్పని ఘోర పరాభవం
చెన్నై ఏప్రిల్ 25 (జనంసాక్షి) : ఐపీఎల్‌లో-6లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ హైదరాబాద్ సన్‌రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై 5వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవెసింది.మహీంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ ఇన్సింగ్స్ టోర్నీ లో రాణిస్తున్న హస్సీ నిలకడమైన బ్యాటింగ్‌తో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు ను ఓడించింది.తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచు కున్న సన్ రైజర్స్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది.డి కాక్ 4పరుగులకే వెనుదిరగగా ఆతరువాత వచ్చిన కామెరున్ వైట్ కేవలం 2పరుగులు చేసి అవుట య్యాడు.మరో ఓపెనర్ ఐపీఎల్ -6 లో తోలి మ్యాచ్ ఆడుతున్న శికరధావన్ 45బంతుల్లో 63పరుగులు చేసి హైదరాబాద్ ఇన్సింగ్స్‌లో టాప్ స్కోరర్ గా నిలిచాడు.దావర్ ఉన్నంత వరకు స్కోర్ బోర్డు కాస్త పరుగులెత్తించినా ఆట మధ్యలో గాయం కారణంగా రిటైర్ హార్డ్‌గా వెనుతిరిగి మళ్లి కాసేపటికి వచ్చి బ్యాటింగ్‌ను కొనసా గించాడు.ఆశిశ్ 16బంతుల్లోనే 36పరులుగులు చేసి సన్‌రైజర్స్‌టీంలో రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫలితంగా హైదరాబద్ సన్ రైజర్స్ 20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 159పరుగులు చేసింది.చెన్నై బౌలర్లలో మోహిత్ శర్మ బ్రావో రెండేసి వికెట్లు తీయగా అశ్విన్ ఓకవికెట్ తీశాడు.
160పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్స్ హస్సీ26బంతుల్లో 45పరు గులు మురళీ విజయ్ 18పరుగులతో చక్కని శుభారంభం అందించారు.మురళీ విజయ్ మిశ్ర బౌలింగ్ లో అవుటయినతరువాత సురేశ్ రైనా 16పరుగులు చేసి మిశ్రా బౌలింగ్‌లోనే అవుటయ్యాడు.తరువాత వచ్చిన చెన్నై కెప్టెన్ ధోని హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 37 బంతు ల్లో 67పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. హస్సీ-ధోనీలు కలిసి జట్టు విజయా నికి పునాదు లేశారు.హస్సీ అవుటయ్యాక బ్రావో 7పరుగులు రవింద్ర జడెజా 1పరుగులు చేసి 19.4ఓవర్లలోనే విజయాన్ని లాంచనంగా పూర్తి చేశారు.హైదరాబాద్ బౌలర్లలో అమిత్ మిశ్ర చక్కని బౌలింగ్ ప్రతిభతో 3వికెట్లు తీసినా కానీ హైదరాబాద్ గెలవలేక పోయింది.సన్‌రైజర్స్ మిగిలి న బౌలర్లలో ఆశిశ్ రెడ్డి ,సమ్మి,ఇశాంత్ శర్మతలో వికెట్ తీశారు. తన దనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టి మ్యాచ్‌ను గెలిపించిన చెన్నై కెప్టెన్ ధోనీకి మ్యాన్‌ఆఫ్‌దమ్యాచ్ ఆవార్డు లభించింది.