ధోనీ జాగ్రత్త !! వ్యాఖ్యల పై అజార్ సూచన
న్యూఢిల్లీ : జట్టు సభ్యుల గురించి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించాలని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మొహ్మద్ అజారుద్ధున్ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇటీవల సలహా ఇ చ్చాడు. డ్రెస్సింగ్‌రూమ్‌లో ఉల్లాసమైన వాతావర ణం నెలకొనాలంటే కెప్టెన్ సభ్యులందరితో అమరి కలు లేకుండా నడుచుకోవాలని ఆయన అన్నారు. ధోనీ తన వ్యాఖ్యలపట్ల జాగ్రత్త వహించాలన్నాడు. భారతక్రికెట్ జట్టులోకి ధోనీరాకముందే చాలామ ంది క్రికెటర్లు 20ఏళ్ల క్రికెట్‌సంతోషకర వాతావర ణాన్ని చెడగొడతాయని అజర్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటి ఆటగాళ్లు భిన్నమైన మైండ్‌సెట్‌తో ఉన్నార న్నారని మరో మాజీకెప్టెన్ కపిల్‌దేవ్ అన్నారు. వా రి మాట నడవడిక భిన్నంగా ఉందని కపిల్ వ్యాఖ్యానించాడు. ఇప్పటి తరం మనసులో ఏదున్నా దాచు కోకుండా మాట్లాడుతున్నారన్నాడు. ధోనీ సెహ్వాగ్ ఎవరైనా మాట్లాడేముందు దేశ ప్రయోజనమే దృష్టిలో పెట్టుకోవాలన్నాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాలతో ఆడినప్పుడే ఇండియాకు అసలైన పరీక్ష అని మరో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. శ్రీలంకతో పరిస్థితులు సులభతరం చేస్తాయని యువకులు ప్రమాదకరంగా పరిణమిస్తారని ఆయన అన్నారు.