ధ్వంసమైన బీటీ రోడ్డుకు మరమ్మతులు ప్రారంభం
కరీంనగర్ (జనంసాక్షి): నగరంలోని కమాన్ వద్ద ధ్వంసమైన బీటీ రోడ్డు మరమ్మత్తు పనులకు మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఈరోజు ఉదయం శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు లెంకల స్వప్న వేణుగోపాల్, దిండిగాల మహేష్, గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్ కంసాల శ్రీనివాస్, పుట్ట నరేందర్, వంగల పవన్ కుమార్, సుడా డైరెక్టర్ నేతి రవివర్మ , మిడిదొడ్డి నవీన్ కుమార్ మీ, కొలిపాక శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ తాటి ప్రభావతి, నాయకులు బందెల శ్రీనివాస్, పెండ్యాల శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.