నకిలీ ఎరువులు విక్రయిస్తున్న షాపుల లైసెన్సు రద్దు చేయాలి

పిఏసీఎస్ వైస్ ఛైర్మన్ ప్రకాష్ రావు
మల్హర్, జనంసాక్షి
మండలంలో నకిలీ ఎరువులు విక్రయిస్తున్న ఫెర్టిలైజర్ షాపుల లైసెన్సు రద్దు చేయాలని తాడిచర్ల పిఎసిఎస్ వైస్ ఛైర్మన్ మల్కా ప్రకాష్ రావు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రమైన తాడిచెర్ల స్థానిక రైతులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. వ్యవసాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు,అవినీతికి  పాల్పడుతున్న ఎరువుల,పురుగు మందుల దుకాణాలపై సంబంధించిన వ్యవసాయ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని  మండలంలో వ్యవసాయ శాఖ యాక్టుకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిషేధిత గడ్డి,బయో ఎరువులు,విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఈ అక్రమ వ్యాపారం అధికారుల కనుసైగలోనే కొనసాగుతున్న అధికారులు తూతుమంత్రంగా తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు.కొన్ని నెలలుగా కొయ్యిర్ గ్రామంలో జై హనుమాన్ ఎరువుల దుకాణంలో నకిలీ విత్తనాలు,నిషేధిత, గడువు ముగిసిన పురుగుల మందుల అమ్మకాల వ్యాపారం యథేచ్ఛగా కొనసాగిస్తూ అమాయక రైతులను ముంచుతున్న  అధికారులు షాప్ యాజమాని లైసెన్స్ రద్దు చేసి పిడి యాక్ట్ పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు.సొసైటీలో సబ్సిడీపై వస్తున్న ఎరువులను సైతం కొందరు వ్యాపారులు డిసిఎంఎస్ కేంద్రాలకు తరలిస్తూ, అధిక ధరలకు విక్రయిస్తూ సొసైటీకి వచ్చే కమిషన్ బారి జేబులో వేసుకొంటూ రైతుల రక్తం తాగుతున్నారని విమర్శించారు.గతంలో కొందరు వ్యాపారులు నిషేధిత మందులు,పత్తి విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడ్డ వ్యాపారులపై చర్యలతోపాటు పిడి యాక్ట్ పెట్టకుండా అధికారులు గలికొదిలేశారని గుర్తు చేశారు.ఇప్పటికైనా భూపాలపల్లి జిల్లా వ్యవసాయ ఉన్నతాధికారులు మండల వ్యాప్తంగా ఎరువుల దుకాణాలపై తనిఖీలు చేపట్టి వ్యవసాయ శాఖ  యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని లేదంటే వ్యవసాయ కమిషనర్ కు పిర్యాదు చేయునట్లుగా హెచ్చరించారు.