నకిలీ ఓటరు కార్డుల కేసులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

మరో 14మందిపైనా కేసు నమోదు
బెంగళూరు,మే11(జ‌నం సాక్షి ):  కర్ణాటకలోని జలహాల్లీ ప్రాంతంలోని ఓ భవనం ప్లాట్‌ నుండి మంగళవారం సుమారు పదివేల ఓటర్ల కార్డుల స్వాధీనం చేసుకున్న కేసులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎన్‌.ముని రత్నతో సహా 14 మందిపై బెంగుళూరు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మే 8 న బెంగళూరు రాజరాజేశ్వరి నగర్‌ నియోజకవర్గంలోని జలహల్లి ప్రాంతంలోని అపార్టుమెంట్‌లో ఎన్నికల కమిషన్‌ అధికారులు సోదాలు నిర్వహించి 9,896 ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో కొత్త పేర్లను చేర్చడానికి ఉపయోగించిన ఫార్మ్‌ 6 రసీదు కాగితాలను పోలిన కౌంటర్‌ ఫాయిల్లను లక్షకు పైగా కనుగొన్నారు. రాజరాజేశ్వరి నగర్‌ నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్న మునిరత్న మాట్లాడుతూ తనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం దారుణమని, తనను వేధించడానికి, అవమానపర్చాలన్న ఉద్దేశంతో ఇది ఒక భాగమని ఆరోపించారు. తన నియోజకవర్గంలో ఓటు వేయడానికి సుమారు 40 వేల కరపత్రాలను పంచానని, కావాలంటే ప్రతి ఇంటిని పరిశీలించవచ్చునని తెలిపారు. అక్కడ ఎ/-లాట్‌లో దొరికిన కరపత్రం ఆధారంగానే తనను 14వ నిందితునిగా చేర్చారని పేర్కొన్నారు. అపార్ట్‌మెంట్‌ యజమాని మంజుల నంజుమూరి, ఆమె అ/-దదెదారు రేఖ, మరో 11 మందిపై కేసులు నమోదు కాగా, ఎవరినీ అరెస్ట్‌ చేయలేదు.