నడిగడ్డలో ప్రజా సమస్యలపై పోరాడే నాయకత్వాన్ని తయారు చేయడమే మా లక్ష్యం

నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 28 : నడిగడ్డలో ప్రజల సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడే బహుజన నాయకత్వం రావాలని, రానున్న రోజుల్లో బడుగు బలహీన వర్గాలు సంఘటితమై రాజకీయ చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నదని, నీతి,నిజాయితీ తొ పాటు ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి గల నాయకత్వం కోసం నడిగడ్డ హక్కుల పోరాట సమితి కృషి చేస్తుందని ఈ రోజు ప్రైవేట్ హోటల్లో జరిగిన రాజకీయ శిక్షణ తరగతుల కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ అన్నారు.
ఇకనుంచి ప్రతి నెల నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించి, సమస్యలపై ఏ రకంగా పోరాటాలు జరపాలో నిర్ణయించి, మా వర్గాలను రాజకీయ చైతన్యం చేస్తామని తెలిపారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతం ఒక కుటుంబ పాలనలో నలిగిపోయిందని బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగనీయకుండగా అణగదొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో అక్కడక్కడ మేము సర్పంచు లు, ఎంపిటిసిలుగా అయినా కూడా మా చేతుల్లో అధికారం లేకుండా పోయిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు మండలాల నాయకులు విష్ణు తిమ్మప్ప,లక్ష్మన్న, చిన్న రాముడు, ప్రేమ్ రాజ్, ఉప్పరి కృష్ణ, గోపాల్, అవనీ శ్రీ, ఆలూరు వెంకట్రాములు,అంజి, గోవిందు, భీమన్న గౌడ్, మరియు ఆయా గ్రామాల కమిటీ నాయకులు పాల్గొన్నారు.