నడిగడ్డ కోసం ఆడబిడ్డ దీక్ష

3
హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 2(జనంసాక్షి):తెలంగాణలో ప్రత్యేక జిల్లాల ఆందోళనలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. తాజాగా గద్వాల జిల్లా కోరుతూ మాజీ మంత్రి డీకే అరుణ రెండు రోజుల నిరాహార దీక్ష చేయనున్నారు.  శనివారం, ఆదివారం ఇందిరాపార్క్‌ వద్ద దీక్షకు దిగనున్నట్టు ప్రకటించారు. కాగా కొత్త జిల్లాల ముసాయిదా అశాస్త్రియంగా ఉందని మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. ఇష్టానుసారంగా జిల్లాల విభజన చేస్తున్నారని మండిపడ్డారు. గద్వాల, జనగామలను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పాపులర్‌ డిమాండ్ల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు.గద్వాలను వనపర్తిలో కలపకుండా గద్వాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ నిరాహార దీక్షకు సిద్ధమన్నారు. గద్వాలను వనపర్తిలో కలపొద్దన్నారు. వనపర్తిని జిల్లా చేయోద్దంటూ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. మరోసారి సీఎం దృష్టికి గద్వాల అభిప్రాయాన్ని తీసుకెళ్లేందుకే నిరాహార దీక్ష అన్నారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిరంజన్‌ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని చెప్పారు.