నడి రోడ్డుపై తల నరికి… యువతికి నిప్పంటించిన వ్యక్తి
చిత్తూరు/గుంటూరు : చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోను పుత్తూరులో ఓవ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈరోజు ఉదయం స్థానిక పున్నమి రిపోర్ట్ సమీపంలో ఈ హత్య జరిగింది. చెరుకు ప్యాక్టర్‌లో పిట్టర్‌గా పని చేస్తున్న మధు అనే వ్యక్తి ఉదయం తన ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అతని తలను దారుణంగా నరికాడు.
అతర్వాత మొండెన్ని రోడ్డుపైనే వదిలేశాడు తలను మాత్రం రోడ్డు పక్కన పడేశాడు. అయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మధుకు శత్రువులు ఎవరు లేరని సన్నిహితులు చెబుతున్నారు. దీంతో ఎవరు హత్య చేశారో పోలీసులకు అంతుచిక్కడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.
యువతికి నిప్పంటించిన వ్యక్తి
గుంటూరు జిల్లాలో ఓ మహిళను ఓ యువకుడు హత్య చేశాడు. ఓ యువకుడు ఓ యువతిని తనతో పాటు ద్విచక్ర వాహనంపై ఈవూరుపాలెంకు తీసుకు వచ్చాడు. అక్కడ వారిద్దరి మధ్య పోట్లాడ జరిగింది. దీంతో అగ్రహంతో అ యువకుడు అమెకు నిప్పంటించాడు. అమె అర్తనాదాలు చేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. దీనిని గమనించిన నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు అ యువతి మృతి చెందింది. విజయలక్ష్మిగా గుర్తించారు. పోలీసులు నిందుతుడి కోసం గాలిస్తున్నారు.
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం మేకలబండలో కుటుంబ కలహల కారణంగా దంపతులు గోంతు కోసుకున్నారు.ఉదయం ఇద్దరు ఘర్ణణకు దిగారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వీరిద్దరి పరిస్థితి విషయంగా ఉంది. స్థానికులు వీరిని వెంటనే అసుపత్రికి తరలించారు.