నడ్డాపై విమర్శలు అహంకార హేతువు: పల్లె

నిజామాబాద్‌,ఆగస్ట్‌20 (జనం సాక్షి)  : బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జెపి నడ్డాపై కెటిఆర్‌ చేసిన విమర్శలు బాధ్యతా రహితమని బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. ఇది ఆయన అహంకారానికి నిదర్శనమని అన్నారు. నడ్డా ఎవరో తెలియదని, అబద్దాల అడ్డా అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని అన్నారు. బిజెపి సత్తా ఏమిటో చాటుతామని అన్నారు. దమ్ముంటే తెలంగాణ విమోచనపై మాట్లాడాలని అన్నారు. అధికారికంగా నిర్వహించి మాట్లాడాలన్నారు. పల్లెలో భారతీయ జనతా పార్టీని విస్తరింపజేసి  కాషాయ జెండా ఎగరేస్తామని  ధీమా వ్యక్తం చేశారు.  అన్ని వర్గాల ప్రజల మద్దతుతో భాజపా దేశాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. కశ్మీర్‌లో ఏ ప్రాంత ప్రజలైన జీవించే విధంగా 370 ఆర్టికల్‌ని రద్దు చేయడం సాహసోపేతమైన చర్య అని కొనియాడారు.