నత్తకు నడకలు నేర్పుతున్న మిషన్ భగీరథ పనులు.
బెల్లంపల్లి, నవంబర్ 9, (జనంసాక్షి )
బెల్లంపల్లి నియోజకవర్గంలో మిషన్ భగీరథ పనులు నత్తకే నడకలు నేర్పుతున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇంటింటికి తాగునీరు అందించేంత వరకు ఓటే అడగను అని శపధం చేసి, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినప్పటికీ అధికారులు, కాంట్రాక్టర్లు పెడ చెవిన పెడుతున్నారు. ఒక్క రోజులో పూర్తి చేయాల్సిన పనుల్ని ఏండ్ల తరబడి సాగదిస్తూ నత్త సైతం సిగ్గుపడేలా చేస్తున్నారు. ఇది బెల్లంపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోను దాదాపు ఇంతే పరిస్థితి నెలకొంది. పైన ఫోటోలో కనిపిస్తున్న గుంత నెన్నెల మండల కేంద్రంలోనిది ఈ గుంతను తవ్వి సుమారు ఆరు నెలలకు పైనే అవుతుంది. రోడ్డు పక్కన గుంత తవ్వడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆరు నెలల కాలం నుంచి ఏదో మొక్కుబడిగా వచ్చి కాసేపు మరమ్మత్తులు చేస్తున్నట్లు నటిస్తున్నారు. కానీ పని పూర్తి గుంతను పూడ్చడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్న చిన్న పనులను ఏండ్ల తరబడి sagadis