నయీం డైరీలో బడా నేతల పేర్లు బయటపెట్టండి
– 1000 రూపాయాలు తీసుకున్నారని 60 జర్నలిస్టుల పేర్లు బయటపెట్టారుకదా
టీయూడబ్ల్యూజే(ఐజేయూ) సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ డిమాండ్
హన్మకొండ, సెప్టెంబర్ 4 (జనం సాక్షి):గ్యాంగ్‌స్టర్ నయూం కేసులో కావాలని జర్నలిస్టుల పేర్లు బయటపెట్టిన సిట్ అధికారి నాగిరెడ్డి.. నయీంతో ములాఖత్ అయి కోట్లు గడించిన రాజకీయ నేతలు, పోలీసు అధికారుల
పేర్లు బహిర్గతం చేయాలని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ డిమాండ్ చేశారు. గ్యాంగ్‌స్టర్ నయీం డైరీలో ఉన్న పేర్లన్నీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు.ఆదివారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఐజేయు అనుబంధ టియుడబ్ల్యూజే జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాటా ్లడారు.నయీం సంఘటనలో ఇటీవల ముడుపులు తీసుకున్న వారిలో జర్నలిస్టులు కూడా ఉన్నారని పేర్కొంటున్నారని,పావలా, రూపాయి తీసుకున్న జర్నలిస్టుల పేర్లు మాత్రమే కాదని, కోట్ల రూపాయలు తీసుకున్న ప్రజాప్రతినిధులు,పోలీసు అధికారుల పేర్లను బయట పెట్టాలని డిమాండ్ చేశారు.ఆగస్టు 22న తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టు సమస్యలపై కలెక్టరేట్‌ల ఎదుట ధర్నాలు చేస్తే ఉనిఖి కోసమే ధర్నాలు చేశామని ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి మాట్లాడ డాన్ని ఆయన తప్పుబట్టారు.ఆరు దశాబ్దాలుగా జర్నలిస్టుల సమస్యలపై ఐజేయూ పోరాడుతున్నదని, ఆలాంటి సంఘానికి ఉనిఖి కోసం ఆందోళనలు చేయాల్సి అవసరం లేదని చెప్పారు.కాగా ఇటీవ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో జర్నలిస్టుల ఆందోళనకు మద్దతుగా వచ్చిన ప్రకటన వెనుక యూనియన్ నేత కే.శ్రీనివాస్‌రెడ్డి, తాను ఉన్నట్లు దుర్మార్గపు ప్రచారానికి పూనుకుంటున్నారని,ఈ క్రమంలో మావోయిస్టు నేత జగన్ తాను ఇచ్చిన ప్రకనటపై స్పష్టతనివ్వాలని ఆయన కోరారు.ప్రజా ఉద్యమాలకు మద్దతు తెలుపుతూ మావోయిస్టు జగన్ ఈ ప్రకటన ఇచ్చార, లేదా ఎవరైన కోరితే ఇచ్చార అన్నదానిపై వాస్తవాలను ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టులు ముందుండి పోరాడారని, కానీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం జర్నలిస్టులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. జర్నలిస్టులు తమ హక్కులను సాదించుకునేందుకు నిరంతరం పోరాటాలే మార్గమని,త్వరలోనే మరిన్నీ ఉద్యమాలకు కార్యచరణ ప్రకటించనున్నామని తెలిపారు.సీనియర్ పాత్రికేయు లు రామచంద్రమూర్తి మాట్లాడుతూ జర్నటిస్టులను రాజకీయ నాయకులు, ఇతర వ్యక్తులు, సంస్థలు ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని, కానీ జర్నలిస్టులు ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా ప్రజల పక్షాన నిలబడాలని కోరారు.జర్నలిస్టులలో జవాబిదారి తనం పెంపొందించాల్సిన అవసరం ఉందని, సమాజంలో నీతి,నిజాయితిలను నిలబెడుతూ ప్రజలకు అండగా నిలవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనయర్ నాయకులు టి.కరుణాకర్, జిఆర్.సంపత్,ఐజేయూ శాశ్వత ఆహ్వానితులు దాసరి కృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు దొంతు రమేష్, కార్యవర్గ సభ్యులు వి.వెంకటరమణ, చిన్నపత్రికల సంఘం అధ్యక్షుడు నల్లాల బుచ్చిరెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా కన్వీనర్ కంచే కుమారస్వామి,నాయకులు ఎం.సుధాకర్ రావు,మధు, కంకనాల సంతోష్,లక్ష్మణ్,దూలం శ్రీనివాస్,ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.