నరకం చూపించారు : కంటతడి పెట్టిన యడ్యూరప్ప
బెంగూళూర్ : బిజెపిలో తనకు నరకం చూపించారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యాడ్యూరప్ప అయ్యారు. పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉందని ఆయన అన్నారు.తాను ఈ రోజు బిజెపికి రాజీనామ చేస్తూన్నారని ప్రకటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం కంటతడి పెట్లారు.. పార్టీకీ తాను ఎంతో శ్రమించానని చెప్పారు. తనను పార్టీలో సరిగా చూడలేని ఆయన బిజెపిని నింధించారు. పార్టీ కోసం తాను ఎంతో శ్రమించినప్పటికీ, లోక్‌సభ సీట్లు ఎక్కువగా సంపాదించి పెట్టినప్పటికి తనకు పార్టీలో తగిన గౌరవం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యకం చేశారు. బిజెపికి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు… బిజెపిలో ఆయన నలభై ఏళ్లపాటు పనిచేశారు. ”నేను పార్టీ నుంచి తప్పుకుంటున్న….పార్టీ నాకు ప్రతిది ఇచ్చింది. పార్టీ ప్రాథామిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తూన్నా” అని ఆయన అన్నారు. యడ్యూరప్ప రాజీనామాకు ముందే ఆయన నియోజకవర్గంలోని బిజెపిశాఖ లోని నాయకులు మొత్తం రాజీనాయా చేశారని ఆయన వాళ్ళనీ రాజీనామా చేయ్యామ్మని చెప్పలేదని అన్నారు… యడ్యూరప్ప మధ్యాహ్నం 12 గంటలకు విధానసభకు వెళ్ళి రాజీనామా లేఖను సమర్పిస్తానాని… పార్టీ తనను వద్దని అనుకుంటోందని, అందుకే రాజీనామా చేస్తూన్నాని యడ్యూరప్ప అయ్యారు. ఇదిలా ఉంటే యడ్యూరప్ప డిసెంబర్ 9వ తేదిన కర్ణాటక జనతా పార్టీని ఏర్పాటు చేస్తూన్నారు. అది కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినం కావడం విశేషం. దాదాపు 50మంది శాసనసభ సభ్యులు తమ పార్టీలలో చేరుతున్నారని యడ్యూరప్ప పెట్టాబోయె కెజెపి నాయకులు భావిస్తూన్నారు.