నరేందర్ కే తూర్పు మున్నూరు కాపుల ఓట్లు
నరేందర్ కే తూర్పు మున్నూరు కాపుల ఓట్లు
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 18 (జనం సాక్షి)
వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కే తిరిగి మున్నూరు కాపులంతా ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని పలువురు మున్నూరు కాపు పెద్దలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ మేరకు కరీమాబాదులోని మున్నూరు కాపు భవనంలో బుధవారం తూర్పు మున్నూరు కాపు సమన్వయకర్త పోతు కుమారస్వామి అధ్యక్షతన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిల వరంగల్ పిఎసిఎస్ చైర్మన్ కేడల జనార్దన్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి ఎమ్మెల్యే నరేందర్ కు టికెట్ కేటాయించి, బీఫామ్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి మంత్రి కేసీఆర్ కుధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మున్నూరు కాపుల భవన నిర్మాణానికి దేశాయిపేట సర్వే నెంబర్ 61 లో ప్రభుత్వం ద్వారా 4200 గజాల స్థలాన్ని కేటాయించడం తోపాటు ఖమ్మం బైపాస్ రోడ్డు ఉరుసు శివారు సర్వేనెంబర్ 268 లోని ఒకే ఎకరం 23 గుంటల భూమిని కూడా ఇప్పిస్తానని ఎమ్మెల్యే నరేందర్ మాట ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం అన్నారు. అదేవిధంగా కిల వరంగల్ లో జరిగిన ఓ టీవీ ఛానల్ డిబేట్లో ఎమ్మెల్యే నరేందర్ ను గ్లాసులు కడిగేటోడు అని మాట్లాడిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు మాటలని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మున్నూరు కాపు నేత గడ్డం రమేష్ మాట్లాడుతూ మున్నూరు కాపులంతా ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతుందని అది ఈనాడు రుజువైందని చెప్పారు. గజ్జల రామకృష్ణ మాట్లాడుతూ కాపులంతా ఒక్కటిగా ఉండటం వల్ల విజయం సిద్ధిస్తుంది అన్నారు. మాజీ కార్పొరేటర్ కేడల పద్మ మాట్లాడుతూ ఎమ్మెల్యే నరేందర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. తోట తిరుపతయ్య మాట్లాడుతూ 4200 గజాల స్థలాన్ని భవనానికి ఇచ్చిన ఎమ్మెల్యే నరేందర్ కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ తూర్పు మున్నూరు కాపు కోఆర్డినేటర్ పోతు కుమారస్వామి మాట్లాడుతూ కాపుల చిరకాల కోరిక అయిన భవన స్థలాన్ని మంజూరు చేయించిన ఎమ్మెల్యే నరేందర్ ను కాపులు ఎన్నడు మర్చిపోరన్నారు. ఎక్కడ కాపులు నిలబడ్డ నిలబడిన వారిని గెలిపించుకునే బాధ్యత కాపు కుల బాంధవులపై ఉందన్నారు. ఈ సమావేశంలో అడహాక్ కమిటీ బాధ్యులు పెంచాల గోపాల్, మేడిది మధుసూదన్, ఒగిలిశెట్టి అనిల్, కుందారపు రాజేందర్, తోపాటు గజ్జల రామకృష్ణ ,పల్లం రవి, సిద్ధం రాజు, మాజీ కార్పొరేటర్ మేడిది రజిత తదితరులు పాల్గొన్నారు