నర్సాయిపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

కోడేరు (జనం సాక్షి) ఆగస్టు 31 నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని నర్సాయిపల్లి గ్రామంలో 160 మంది లబ్ధిదారులకు మంజూరైన ఆసరా పెన్షన్ కార్డ్స్ ను ఎమ్మెల్యే బుధవారం రోజు  లబ్ధిదారులకు పంపిణీ చేశారు._
20 లక్షల రూపాయల నిధులతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల రూపకల్పనకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడం జరిగింది.తెలంగాణ క్రీడా ప్రాంగణంను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రారంభించారు. తదనంతరం ఎమ్మెల్యే  క్రీడా ప్రాంగణంలో కాసేపు సరదాగా ఆడారు,
గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదికను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి  ప్రారంభించారు.
నూతన రాష్ట్రం సాధించిన బంగారు కలలను సహకారం చేసుకుంటున్నాం అని  కొత్త రాష్ట్రం ఐన అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధిలో మొదటి స్థానంలో దూసుకొని పోతున్నామని ప్రస్తుతం దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తుందని వారు  అన్నారు.
అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ కార్డ్స్ అందుతాయని తెలియజేశారు.
అర్హులైన వారందరు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వీరమాచవర్ధన్ రెడ్డి సూచించారు.
ఈ కార్యక్రమలలో ఎమ్మెల్యే తో పాటు  మండల ప్రజా ప్రతినిధులు, గ్రామ సర్పంచ్ కే సత్యనారాయణ, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.