నల్లగొండ కు నిధుల వరద

పట్టణ సుందరీకరణకు మార్గం సుగమం

 

 

ముందెన్నడూ లేని రీతిలో అభివృద్ధి ప్రణాళిక

ఇప్పటికే మౌలికసదుపాయాల కల్పనలో నల్లగొండ భేష్

పానగల్లు ఛాయా
సోమేశ్వరాలయం& పచ్చలసోమేశ్వరాలయం,వేంకటేశ్వరస్వామి ఆలయాలకు మహర్దశ

ఐటి పార్క్ టూ ఉదయసముద్రానికి అప్రోచ్ రోడ్

కనీవినీ ఎరుగని తీరులో 90.61 కోట్లతో కళా భారతి నిర్మాణం

నల్లగొండలో శాశ్వత హెలిపాడ్ నిర్మాణానికి నిధుల విడుదల…

భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకలలో.. నేడు ఫ్రీడమ్ ర్యాలీలో… ప్రకటన చేసిన ఎమ్మెల్యే కంచర్ల.
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
నల్లగొండ పట్టణాభివృద్ధి కి నిధుల వరద తాకిడి మొదలైంది.రహదారుల విస్తరణ తో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో నెంబర్ స్థానంలో నిలిచిన పట్టణాన్ని అభివృద్ధి పరిచేందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ ముందెన్నడూ లేని రీతిలో నిధుల వర్షం కురిపించారు.ఏక కాలంలో 233.82 కోట్లు విడుదల చేయడం నల్లగొండ చరిత్రలోనే చారిత్రాత్మకమైన సంఘటనగా చెప్పుకోవొచ్చు.ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో పెట్టిన వాగ్దానాలను అమలు పరచడంలో యావత్ భారతదేశంలో ముందున్న టి ఆర్ యస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పని మెడికల్ కళాశాల,ఐటి హబ్ లను జిల్లా కేంద్రంలో నెలకొల్పి విమర్శకుల నోరు మూయించిన విషయం విదితమే. దానికి తోడు పట్టణాన్నిసుందరికరించడంతో పాటు పట్టణాభివృద్ధికై కుర్చీ వేసుకుని తరతరాలుగా వెనుకబడిన నల్లగొండ కు అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హామీ అనతి కాలంలోనే అమలులోకి రావడం ఒక ప్రత్యేకత అయితే అందుకు అనుగుణంగా నిధుల వరద పారడం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణా ప్రభుత్వానికే చెల్లింది అన్నది నిస్సందేహంగా చెప్పుకోవొచ్చు.అందులో భాగంగానే ఏలిన నాటి శనిని పారద్రోలి పట్టణాభివృద్ధి ని కోరుకున్న ప్రజల ఆలోచనలకు అద్దం పట్టే తీరులో స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ప్రతిపాదనల మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందిస్తూ విడుదల చేసిన జీఓ లు సాక్షిభూతంగా నిలుస్తుండగా తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10 న విడుదల చేసిన జీ. ఓ నెంబర్ 244 ద్వారా 233.82 కోట్ల నిధుల విడుదల పట్టణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా చేసింది.ఆబాల గోపాలం నుండి పండు ముదుసలి వరకు కోరుకున్న రీతిలో చర్లపల్లి నుండి కేశిరాజు పల్లి వరకు,పానగల్లు నుండి కత్తాల్ గూడెం వరకు ఎటు చూసినా గులాబీ మార్కు కనిపించేలా జరిగిన అభివృద్ధి కి నిదర్శనంకాగా తాజాగా విడుదల చేసిన నిధుల తో మాటల ముఖ్యమంత్రి గా గాక చేతల ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియడాబడుతున్నారు అనడంలో అవగింజంతైనా సందేహం లేదు.కాకతీయుల కణాచికి దర్పం పట్టేలా నిలిచిన పానగల్లు లోనీ చారిత్రాత్మక శివాలయాలు అటు పచ్చల సోమేశ్వరాలయం ఇటు ఛాయా సోమేశ్వరాలయం తో పాటు కాంచనపల్లి ప్రభువులు నిర్మించిన పానగల్లు శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర(బాలాజీ) స్వామీ వారి దేవాలయాల పునరుద్ధరణకు గాను విడుదల చేసిన నిధులతో మహార్డశ పడుతుండగా అదే కాంచనపల్లి వంశస్థులు నిర్మించిన వల్లబరాయుడి చెరువు,కాకతీయుల ఎలుబడిలో రాజధానిగా ఫరీడవిల్లిన పానగల్లు లో ఉదయదిత్యుడు నిర్మించినట్లు చెబుతున్న ఉదయ సముద్రం తో పాటు ఐటి హబ్ నుండి పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం,పచ్చల సోమేశ్వరాలయం, శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వరస్వామి(బాలాజీ టెంపుల్) వరకు అప్రోచ్ రోడ్ ల నిర్మాణాలతో ఆరు దశాబ్దాలుగా అభివృద్ధి కి నోచుకోని నల్లగొండ కళకళ లాడా బోతున్నది. వీటన్నింటికి తోడు సాహిత్యానికి బలమైన పునాదులు వేయడంతో పాటు గ్రంధాలయ ఉద్యమాలకు బాసటగా నిలిచిన సాహితీవేత్తల కోరిక, నల్లగొండ నుండే సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టి సినీ గగన నీలాకాశం లో విలనిజాన్ని, హాస్యాన్ని సమపాళ్లలో పండించిన సినీ నటుడు దివంగత జయప్రకాష్ రెడ్డి వంటి కళాకారుల తో పాటు,ఎన్ని కష్ట నష్టాలు ఎదురైన మొక్కవోని ధైర్యం తో ముందుకు సాగుతూ నాటక రంగాన్ని బతికిస్తున్న కోమలి కళాసమితివంటి సంస్థల చిరకాల వాంఛ పట్టణంలో కళాభారతి నిర్మాణం అన్నది మనందరికి తెలియనిది కాదు.అటువంటి చిరకాల స్వప్నం స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అభ్యర్థన మేరకు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి పంపిన ప్రతిపాదనల మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా విడుదల జీ ఓ లొనే కళాభారతిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రత్యేకించి 90.61 కోట్లు విడుదల చేశారు అంటే పట్టణం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న ప్రేమ ఏ పాటిదో అన్నది ఇట్టే అవగతం అవుతోంది. అటువంటి మనసున్న మారాజు కు మనమేం ఇవ్వగల
లం… ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రుడికో నూలు పోగు మాదిరిగా ఒక ఓటు వేయడం మినహా…2014,18 లో వేసిన ఒకే ఒక్క ఓటు ఇంతటి అభివృద్ధికి,పట్టణంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు,ఐటి హబ్,రైతుబందు,రైతు భీమా కు పునాదులు వేస్తే,24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ,యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం,కాళేశ్వరం నుండి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గోదావరి జలాలను పరుగులు పెట్టిస్తే భవిష్యత్ లో వెయ్యబోయే ఓటుతో ఎంతటి అభివృద్ధి ని సాధించ వచ్చో అన్నది సహృదయులైన ప్రజలు గుర్తిస్తారు.

తాజావార్తలు