నల్లధనంపైచేతులెత్తేశారు: ఆనంద భాస్కర్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి28  నల్లధనంపై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లి చేతులు ఎత్తేశారని తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్‌.పి ఆనంద భాస్కర్‌ వ్యాఖ్యానించారు.అరుణ్‌ జైట్లి బడ్జెట్‌ ప్రసంగం తర్వాత విూడియాతో భాస్కర్‌ మాట్లాడారు. నల్లదనం ను తీసుకువస్తామని ప్రకటించిన బిజెపి ఇప్పుడు కొత్త చట్టం తెస్తామంటూ దారి మళ్లించే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. పదాల గారడీ ద్వారా ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నించారని భాస్కర్‌ అన్నారు. జిఎస్‌ టి గురించి మాత్రమే సాధించామని చెప్పారని ఆయన అన్నారు.తెలంగాణ ఆర్ధిక సుసంపన్న రాష్ట్రం అని , కేంద్రంపై ఆధారపడి లేదని, న్యాయబద్దంగా వస్తే చాలని అన్నారు. విభజిత ఎపికి హావిూలు ఇస్తామని ఆర్ధిక మంత్రి చెప్పారని అన్నారు.

బ్జడెట్‌ నిరాశ కలిగించింది: రామ్మోహన్‌నాయుడు

కేంద్ర బ్జడెట్‌పై తెదేపా ఎంపీలు అసంతృప్తితో ఉన్నారు. 2015-16 కేంద్ర బ్జడెట్‌పై శ్రీకాకుళం తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ…. ఆంధప్రదేశ్‌ విషయంలో కేంద్రం శ్రద్ధచూపకపోవడం నిరాశ కలిగించిందన్నారు. మొదట్నుంచి కేంద్రంపై ఒత్తిడి చేస్తూనే ఉన్నామని వెల్లడించారు.