నల్లమలలో ఘనంగా అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహించిన అటవీశాఖ అధికారులు.

అచ్చంపేట ఆర్ సి 29 జూలై (జనం సాక్షి న్యూస్) : అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని ఫారెస్ట్ రేంజ్ లలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు పులుల సంరక్షణకు సంబంధించి పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ లు సంయుక్తంగా ఆదివాసులతో అడవులను, జంతువులను సంరక్షించాలని నినాదాలు ఇస్తూ ర్యాలీ చేపట్టారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు మాట్లాడుతూ పులుల సంరక్షణ అభివృద్ధి ప్రకృతి జీవవైద్య మనుగడకు నిదర్శనమని తెలిపారు జంతువుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. అడవి నరకడం మంటలు పెట్టడం మరియు వన్యప్రాణులకు హాని తలపెట్టొద్దని సూచించారు కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, టైగర్ ట్రాకర్లు, ఫారెస్ట్ వాచర్లు, ఆర్డిటి స్వచ్ఛంద సేవా సంస్థ సిబ్బంది, ఆదివాసులు, తదితరులు పాల్గొన్నారు