నవంబర్ 13న జహీరాబాద్ పిల్లల పండగ జయప్రదం చేయండి.
జహీరాబాద్ అక్టోబర్ 9 (జనం సాక్షి) పట్టణంలోని శ్రామిక్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జహీరాబాద్ పిల్లల పండగ నవంబర్ 13న పిల్లల పండగ నిర్వహించనున్నట్టు పండుగ ను జయప్రదం చేయాలని శ్రామిక్ విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ ట్రస్టీ రాంచందర్ తెలిపారు.శనివారం ప్రిపరేటరీ మీటింగ్ శ్రామిక్ భవన్ లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ప్రముఖ స్పోకెన్ ఇంగ్లీష్ సంస్థ రస్సెల్స్ స్పోకెన్ ఇంగ్లీష్ చైర్మన్ జహీర్ రాజా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జహీరాబాద్ ప్రాంత ప్రజలకు, విద్యార్థులకు, మహిళలకు, యువతకు శ్రామిక్ విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్న కృషి,సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. విద్యార్థిని విద్యార్థులకు, ప్రజలకు సేవలు అందించడమే కాకుండా చదువు పట్ల శ్రామిక్ విజ్ఞాన కేంద్రం చూపిస్తున్న కృషి అభినందనీయమని, అందులో భాగంగా నిర్వహించే జహీరాబాద్ పిల్లల పండగ అత్యంత జయప్రదంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముందు ముందు కూడా పెద్ద ఎత్తున సేవా బహుముఖ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రామిక్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి డాక్టర్.శివబాబు, కోశాధికారి ఎస్.మహిపాల్, ప్రముఖ వైద్యులు విజయలక్ష్మి, ఎపిజివిబి బ్యాంకు మాజీ మేనేజర్ వినాయకుమార్, శ్రీ కృష్ణవేణి స్కూల్ ప్రిన్సిపాల్ వశిష్టారెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త వెంకటేశం, కొటక్ మహీంద్ర మేనేజర్ నర్సింలు, వార్డెన్ వంశీకృష్ణ, టీచర్ వలి, సుభాష్ టీచర్ రాంచంద్రయ్య, సతీష్ రాథోడ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్, వివిధ ప్రజాసంఘాల నాయకులు ప్రతాప్, చంద్రన్న, రాజేష్, దుర్గాప్రసాద్, తిరుపతి, నర్సయ్య, సలీం, మల్లేష్, చంద్రవర్ధన్, సంజన, ప్రజ్ఞ, తదితరులు ఉన్నారు.